కొండా సురేఖకి లైన్ క్లియర్ అయిందా?
టీఆర్ఎస్ టికెట్ రాలేదు. తొలి జాబితాలో ఆమె పేరు లేదు. రెండో జాబితాలో ఆమె పేరు ఉంటుందా? అనే సస్పెన్స్ నెలకొంది. టీఆర్ఎస్‌పై తిరుగుబాటు ప్రకటించిన వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ రాజకీయ భవిష్యత్ ఏంటనే చర్చ ఇప్పుడు నడుస్తోంది. టికెట్ రాకపోవడంతో హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ప్రెస్‌మీట్ పెట్టి టీఆర్ఎస్ హైకమాండ్‌పై విమర్శల బాణాలు విసిరారు. ఆ తర్వాత ఆమె సైలెంట్ అయిపోయారు. ఎక్కడా ఆమె కనిపించలేదు. మాట్లాడలేదు. అయితే వినాయకచవితి […]
టీఆర్ఎస్ టికెట్ రాలేదు. తొలి జాబితాలో ఆమె పేరు లేదు. రెండో జాబితాలో ఆమె పేరు ఉంటుందా? అనే సస్పెన్స్ నెలకొంది. టీఆర్ఎస్‌పై తిరుగుబాటు ప్రకటించిన వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ రాజకీయ భవిష్యత్ ఏంటనే చర్చ ఇప్పుడు నడుస్తోంది. టికెట్ రాకపోవడంతో హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ప్రెస్‌మీట్ పెట్టి టీఆర్ఎస్ హైకమాండ్‌పై విమర్శల బాణాలు విసిరారు. ఆ తర్వాత ఆమె సైలెంట్ అయిపోయారు. ఎక్కడా ఆమె కనిపించలేదు. మాట్లాడలేదు.
అయితే వినాయకచవితి నవరాత్రుల దినాలు ఆదివారంతో ముగిశాయి. దీంతో ఇప్పుడు కొండా సురేఖ టీఆర్ఎస్ తో తన అనుబంధాన్ని కొనసాగిస్తారా? లేక పార్టీతో తెగదెంపులు చేసుకుంటారా? అనేది తేలే అవకాశం ఉంది. ప్రెస్‌క్లబ్ లో ప్రెస్‌మీట్ తర్వాత టీఆర్ఎస్ నేతలతో రాయబారాలు నడిచినట్లు తెలుస్తోంది. వరంగల్ ఈస్ట్ టికెట్‌పై కేసీఆర్ క్లారిటీ ఇచ్చారని తెలుస్తోంది. ఈస్ట్ టికెట్ ఇచ్చేందుకు అభ్యంతరం లేదని కేసీఆర్ అన్నట్లు ప్రచారం నడుస్తోంది. కొండా సురేఖ టికెట్‌కు లైన్ క్లియర్ అయిందని… ఆమె టీఆర్ఎస్‌లోనే ఉంటారని కొందరు చెబుతున్నారు.
మరోవైపు కాంగ్రెస్ తమ కుటుంబానికి రెండు టికెట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చిందనేది ఇంకో టాక్ విన్పిస్తోంది.
వరంగల్ ఈస్ట్ తో పాటు పరకాల, భూపాలపల్లి సీట్లలో కొండా ఫ్యామిలీ పోటీ చేయాలని అనుకుంటోంది. అయితే పరకాల, వరంగల్ ఈస్ట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.
అయితే ఈ సీట్లపై హైకమాండ్ నుంచి నేరుగా హామీ వస్తేనే నిర్ణయం తీసుకోవాలని వారు ఆలోచిస్తున్నారట. అయితే దాదాపు మూడు సీట్లలో ప్రభావం చూపే కొండా ఫ్యామిలీని టీఆర్ఎస్ వదులుకునే ప్రసక్తే లేదని కొందరు చెబుతున్నారు. ఇప్పటికే కొండా ఫ్యామిలీతో కేటీఆర్ సంప్రదింపులు జరిపారని వీరు అంటున్నారు. త్వరలో విడుదలయ్యే టీఆర్ఎస్ రెండో జాబితాలో వరంగల్ ఈస్ట్ టికెట్ కొండా ఫ్యామిలీకే కేటాయిస్తారని చెబుతున్నారు.