"ఎన్టీఆర్" సినిమా రైట్స్ ని సొంతం చేసుకున్న ఏషియన్ సినిమాస్

లెజెండరీ పొలిటీషియన్ సీనియర్ హీరో నందమూరి తారకరామారావు జీవిత కథ ఆధారంగా “ఎన్టీఆర్” సినిమా రూపొందుతుంది. ఈ సినిమా లో ఎన్టీఆర్ పాత్రలో నందమూరి బాలకృష్ణ హీరో గా నటిస్తున్నాడు. అలాగే ఎన్టీఆర్ భార్య పాత్రలో విద్యా బాలన్ నటిస్తుంది. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి భారీ రేంజ్ లో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా యొక్క నైజాం రైట్స్ ని ఏషియన్ సినిమాస్ భారీగా డబ్బులు ఇచ్చి తీసుకున్నారట. […]

Advertisement
Update:2018-09-24 04:02 IST

లెజెండరీ పొలిటీషియన్ సీనియర్ హీరో నందమూరి తారకరామారావు జీవిత కథ ఆధారంగా “ఎన్టీఆర్” సినిమా రూపొందుతుంది. ఈ సినిమా లో ఎన్టీఆర్ పాత్రలో నందమూరి బాలకృష్ణ హీరో గా నటిస్తున్నాడు. అలాగే ఎన్టీఆర్ భార్య పాత్రలో విద్యా బాలన్ నటిస్తుంది. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి భారీ రేంజ్ లో రిలీజ్ కానుంది.

అయితే ఈ సినిమా యొక్క నైజాం రైట్స్ ని ఏషియన్ సినిమాస్ భారీగా డబ్బులు ఇచ్చి తీసుకున్నారట. దిల్ రాజుతో పోటి పడి మరి ఈ సినిమా రైట్స్ ని సొంతం చేసుకున్నారు ఏషియన్ సినిమాస్. చంద్రబాబు నాయుడు పాత్రలో రానా కనిపించబోతున్న ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వర్ రావుగా అక్కినేని సుమంత్ నటిస్తున్నాడు. షూటింగ్ శర వేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాని క్రిష్ చాలా బాగా తెరకేక్కిస్తున్నాడు అని ఈ సినిమా పోస్టర్స్ చూస్తుంటే తెలుస్తుంది. మరి క్రిష్ ఈ సినిమాతో అందరి అంచనాల్ని అందుకుంటాడో లేదో చూడాలి.

Tags:    
Advertisement

Similar News