వెంకటేష్ కుమార్తె ప్రేమ వివాహం

హీరో వెంకటేష్ కుమార్తె ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు. ఆమె వివాహానికి పెద్దలు కూడా అంగీకరించినట్టు చెబుతున్నారు.  కుమార్తె ఆశ్రిత బేకరీ రంగంలో నిపుణురాలిగా ఉన్నారు. ఆమె ఒక ప్రముఖ వ్యక్తి కుమారుడిని ప్రేమించినట్టు చెబుతున్నారు. వారి మధ్య చదువుకునే రోజుల నుంచే స్నేహం ఉంది. ప్రేమ గురించి ఆశ్రిత తల్లితండ్రులకు చెప్పగా వారు … అబ్బాయి ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తి కావడం, పరిచయం ఉన్న వాడే కావడంతో అంగీకరించినట్టు చెబుతున్నారు. తన అన్న సురేష్‌ బాబుతోనూ […]

Advertisement
Update:2018-09-22 11:42 IST

హీరో వెంకటేష్ కుమార్తె ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు. ఆమె వివాహానికి పెద్దలు కూడా అంగీకరించినట్టు చెబుతున్నారు. కుమార్తె ఆశ్రిత బేకరీ రంగంలో నిపుణురాలిగా ఉన్నారు.

ఆమె ఒక ప్రముఖ వ్యక్తి కుమారుడిని ప్రేమించినట్టు చెబుతున్నారు. వారి మధ్య చదువుకునే రోజుల నుంచే స్నేహం ఉంది. ప్రేమ గురించి ఆశ్రిత తల్లితండ్రులకు చెప్పగా వారు … అబ్బాయి ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తి కావడం, పరిచయం ఉన్న వాడే కావడంతో అంగీకరించినట్టు చెబుతున్నారు.

తన అన్న సురేష్‌ బాబుతోనూ ఈ విషయంపై వెంకటేష్ చర్చించిన తర్వాతే పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. త్వరలోనే వీరి వివాహం ఘనంగా నిర్వహిస్తారని చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News