రాఫెల్ స్కాంలో సంచలన పరిణామం

మోడీ సర్కార్‌ను షేక్ చేస్తున్న రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. రాఫెల్ యుద్ధవిమానాల నిర్వాహణ బాధ్యతను ప్రభుత్వ రంగ సంస్థ అయిన ‘హిందూస్థాన్‌ ఏరోనాటికల్స్‌ లిమిటెడ్‌’నుంచి తప్పించి అంబానీకి చెందిని రిలయన్స్‌ డిఫెన్స్‌కు ఇవ్వడం వెనుక పెద్ద కుంభకోణం జరిగిందని కాంగ్రెస్‌ చేస్తున్న ఆరోపణలకు మరింత ఊతం లభించింది. డీల్ కుదిరిన సమయంలో ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఉన్న హోలాండ్‌ సంచలన విషయాలు చెప్పారు. రాఫెల్‌ విమానాల నిర్వాహణ బాధ్యతను రిలయన్స్ డిఫెన్స్‌కు అప్పగించాల్సిందిగా […]

Advertisement
Update:2018-09-22 05:55 IST

మోడీ సర్కార్‌ను షేక్ చేస్తున్న రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. రాఫెల్ యుద్ధవిమానాల నిర్వాహణ బాధ్యతను ప్రభుత్వ రంగ సంస్థ అయిన ‘హిందూస్థాన్‌ ఏరోనాటికల్స్‌ లిమిటెడ్‌’నుంచి తప్పించి అంబానీకి చెందిని రిలయన్స్‌ డిఫెన్స్‌కు ఇవ్వడం వెనుక పెద్ద కుంభకోణం జరిగిందని కాంగ్రెస్‌ చేస్తున్న ఆరోపణలకు మరింత ఊతం లభించింది.

డీల్ కుదిరిన సమయంలో ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఉన్న హోలాండ్‌ సంచలన విషయాలు చెప్పారు. రాఫెల్‌ విమానాల నిర్వాహణ బాధ్యతను రిలయన్స్ డిఫెన్స్‌కు అప్పగించాల్సిందిగా భారత ప్రభుత్వమే సూచించిందని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

భారత్ ఎంపిక చేసిన రిలయన్స్ డిఫెన్స్‌ను కాకుండా మరొకరిని ఎంపిక చేసుకునే చాయిస్ తమకు లేకుండాపోయిందని వ్యాఖ్యానించారు. దీంతో ప్రభుత్వ రంగ సంస్థను తప్పించి తన స్నేహితుడైన అనిల్ అంబానీకి మేలు చేసేందుకే మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారని రాహుల్ చేస్తున్న ఆరోపణ నిజమని నమ్మే పరిస్థితి వచ్చింది. పారిస్‌ కేంద్రంగా నడుస్తున్న ఇన్వెస్టిగేటివ్‌ న్యూస్‌ జర్నల్‌ ‘మీడియా పార్ట్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇక్కడో మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే… రాఫెల్‌ విమానాల నిర్వాహణను దక్కించుకున్న రిలయన్స్ సంస్థ… ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండ్ భార్య నిర్మించిన ఒక చిత్రంలో భారీగా పెట్టుబడి పెట్టింది. హోలాండ్ భార్య ఆ మధ్య ఒక చిత్ర నిర్మాణానికి పూనుకున్నారు. కానీ ఆర్థిక కష్టాల వల్ల అది ఎంతకూ ముందుకుసాగలేదు.

ఇంతలో రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ 30లక్షల యూరోలు సినిమాలో పెట్టుబడిగా పెట్టింది. దీంతో చిత్రనిర్మాణం పూర్తయింది. ఇదంతా రాఫెల్‌ డీల్‌కు ప్రతిఫలమే అన్నది అక్కడి మీడియా ఆరోపణ. ఈ అంశంపై మీడియా ప్రతినిధి ప్రశ్నించినప్పుడే… ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండ్‌… తన భార్య సినిమాలో రిలయన్స్ పెట్టుబడికి, రాఫెల్‌కు సంబంధం లేదని వివరణ ఇచ్చే ప్రయత్నంలో రిలయన్స్ డిఫెన్స్‌ను భారత ప్రభుత్వమే విమానాల నిర్వాహణ కోసం ఎంపిక చేసిందని వెల్లడించారు.

Tags:    
Advertisement

Similar News