రాజకీయ క్రీడలో సమిధ.. ఈ పాపం ఎవరిదీ.?

ఎన్నికల రాజకీయ క్రీడలో ఓ అమాయకపు ప్రాణం బలైపోయింది. రెచ్చగొట్టి టికెట్ సాధించుకునే ఎత్తుగడలో ఓ కుటుంబం రోడ్డునపడింది. టికెట్ దక్కని తాజా మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు తను పోరాడిన అధిష్టానంతోనే సర్దుకుపోయి చంకలు ఆనించుకోగా.. ఈయన కోసం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఓ కార్యకర్త అసువులు బాసాడు. ఈ పాపం ఎవరిదీ.? రాజకీయ నేతలు ఆడిన ఈ క్రీడలో ఎందుకు కిందిస్థాయి నేతలు సమిధలు కావాలి? ముందస్తు ఎన్నికల వేడిని కేసీఆర్ రగిలించారు. మొత్తం 105 మంది […]

Advertisement
Update:2018-09-20 06:35 IST

ఎన్నికల రాజకీయ క్రీడలో ఓ అమాయకపు ప్రాణం బలైపోయింది. రెచ్చగొట్టి టికెట్ సాధించుకునే ఎత్తుగడలో ఓ కుటుంబం రోడ్డునపడింది. టికెట్ దక్కని తాజా మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు తను పోరాడిన అధిష్టానంతోనే సర్దుకుపోయి చంకలు ఆనించుకోగా.. ఈయన కోసం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఓ కార్యకర్త అసువులు బాసాడు. ఈ పాపం ఎవరిదీ.? రాజకీయ నేతలు ఆడిన ఈ క్రీడలో ఎందుకు కిందిస్థాయి నేతలు సమిధలు కావాలి?

ముందస్తు ఎన్నికల వేడిని కేసీఆర్ రగిలించారు. మొత్తం 105 మంది అభ్యర్థులకు టికెట్లు ఇవ్వగా తాజామాజీ ఎమ్మెల్యేల్లో ఇద్దరికి మాత్రమే టికెట్ నిరాకరించాడు. అందులో మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కూడా ఉన్నారు. ఈయన స్థానంలో పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ కు చెన్నూర్ టికెట్ ఇచ్చాడు.

ఇక తనకు టికెట్ దక్కకపోవడంతో నల్లాల ఓదెలు పంతానికి పోయి.. స్వీయ గృహ నిర్బంధం విధించుకున్నారు. ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు అనుచరులు ఆక్రోశంతో ఊగిపోయారు. వీరి అసంతృప్తి చల్లారకముందే బాల్క సుమన్ చెన్నూర్ నియోజకవర్గంలో రాజకీయ ప్రచారానికి తెరలేపడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. దీన్ని తట్టుకోలేని ఓదెలు అనుచరుడు రేగుంట గట్టయ్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం… తనతోపాటు 17మందిని గాయాల పాలు చేశాడు. ఈ క్రమంలోనే తాజాగా పరిస్థితి విషమించి గట్టయ్య చనిపోయాడు.. అతడి కుటుంబం రోడ్డున పడింది..

ఇప్పుడు కట్ చేస్తే కత్తులు దూసుకున్న నల్లాల ఓదెలు, ప్రస్తుత అభ్యర్థి బాల్క సుమన్ ఒక్కటయ్యారు. కలిసి ప్రచారం చేస్తున్నారు. సుమన్ ను గెలిపించాలని ఓదేలే కోరుతున్నాడు. తనకు కేసీఆర్ న్యాయం చేస్తానని హామీ ఇచ్చాడంటున్నారు . కానీ వీరి రాజకీయ క్రీడలో అమాయకుడు బలయ్యాడు. ఆయన కుటుంబం రోడ్డున పడింది. మిగిలిన వారు కూడా కాలిన గాయాలతో ఆస్పత్రిలో నరకం అనుభవిస్తున్నారు. ఇందులో టీఆర్ఎస్ జిల్లా నాయకుడు చేకుర్తి సత్యనారాయణ రెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఈ పాపానికి బాధ్యులెవరనే ప్రశ్న ప్రస్తుతం ఉత్పన్నమవుతోంది.?

Tags:    
Advertisement

Similar News