రాజకీయ నేతల జాతకాల పిచ్చి..

ముందస్తు ఎన్నికలకు సిద్ధం అవుతుండడంతో ఇప్పుడు ఆశావహులందరూ జోతిష్యుల వద్దకు పరుగులు పెడుతున్నారు. ప్రభుత్వం రద్దు కావడంతోపాటు టీఆర్ఎస్ పార్టీ ఏకంగా ఒకేసారి 105మంది అభ్యర్థులను ప్రకటించడంతో వారంతా ప్రచారం మొదలెట్టేశారు.దీంతో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీతోపాటు ఇతర రాజకీయ పార్టీల్లో రాజకీయ వేడి మొదలైంది. టీఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కొని కేసీఆర్ ను గద్దెదించాలనే ఆలోచనతో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలతోపాటు మరికొన్ని పార్టీలు కలిసి మహాకూటమి పేరిట బరిలో నిలించేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి […]

Advertisement
Update:2018-09-19 08:16 IST

ముందస్తు ఎన్నికలకు సిద్ధం అవుతుండడంతో ఇప్పుడు ఆశావహులందరూ జోతిష్యుల వద్దకు పరుగులు పెడుతున్నారు. ప్రభుత్వం రద్దు కావడంతోపాటు టీఆర్ఎస్ పార్టీ ఏకంగా ఒకేసారి 105మంది అభ్యర్థులను ప్రకటించడంతో వారంతా ప్రచారం మొదలెట్టేశారు.దీంతో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీతోపాటు ఇతర రాజకీయ పార్టీల్లో రాజకీయ వేడి మొదలైంది. టీఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కొని కేసీఆర్ ను గద్దెదించాలనే ఆలోచనతో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలతోపాటు మరికొన్ని పార్టీలు కలిసి మహాకూటమి పేరిట బరిలో నిలించేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే..

ఇక కూటమి ఏర్పాటు వల్ల అభ్యర్థులందరూ హడలి చస్తున్నారు. తమకు టికెట్లు రావని మధనపడుతున్నారు. ఓ వైపు రాజకీయ అధినాయకత్వాలు మాత్రం పొత్తులపై చర్చలు సాగిస్తున్నాయి. మరో వైపు గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి. ఒక్కో అసెంబ్లీ స్థానానికి ముగ్గురు, నలుగురు అభ్యర్థులు పోటీపడుతుండడంతో ప్రజల్లో ఏ నాయకుడికి ఇమేజ్ ఉంది.? ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి ప్రభావం చూపుతాడు.? ఏ కులం, ధన ప్రభావం ఎంతనే దానిపై అంచనావేస్తూ ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడ్డాయి. ప్రస్తుతం టీఆర్ఎస్ మినహా ఆశావాహ అభ్యర్థులంతా హైదరాబాద్ లో ఉంటూనే ప్రయత్నాలు చేస్తున్నారట.. గాడ్ ఫాదర్ ల ఆధారంగా పావులు కదుపుతూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు..

ఇక కూటమి ఏర్పాటు.. సీట్ల కరారులో తమకు సీటు వస్తుందా..? ఏం చేయాలో తెలియక జాతకాలతో పంతుళ్ల వద్దకు పరుగులు తీస్తున్నారు ఆశావాహ అభ్యర్థులు. తెలంగాణలో ఫేమస్ జోతిష్యుల వద్దకు వెళుతూ జాతకాలు చూపించుకుంటున్నారు. తమకు తెలిసిన వారితో ఫోన్లు చేయించుకుంటూ ఆరాతీస్తున్నారు. ఇప్పుడు ఏ ఫేమస్ జోతిష్యుడి వద్ద చూసినా నాయకుల పడిగాపులు కనిపిస్తుండడం పొలిటికల్ హీట్ ను సూచిస్తోంది. ఇంకొందరైతే జాతాకాలు అనుకూలంగా లేవని జోతిష్యుల వద్ద తెలుసుకొని నష్టనివారణ పూజలు కూడా చేయించుకుంటున్నారట.. మరికొందరేమో టికెట్ తమకే రావాలని పూజలు చేయాలంటూ జోతిష్యులను కోరుతున్నట్టు తెలిసింది.

Tags:    
Advertisement

Similar News