ఈ ఫుడ్‌ని జుట్టుకీ పెట్టొచ్చు!

మ‌నం తినే, తాగే ఆహార ప‌దార్థాల్లోని కొన్నింటిని మ‌న హెయిర్‌కి కూడా పెట్టొచ్చు. అంటే జుట్టుకి అప్ల‌యి చేయ‌వ‌చ్చు. జుట్టు ఆరోగ్యాన్ని పెంచే అలాంటి ఘ‌న, ద్ర‌వ ప‌దార్థాల గురించి- -తాజా కొబ్బ‌రి నీటిని జుట్టు చివ‌ర్ల‌కు ప‌ట్టిస్తే వెంట్రుక‌లు చిట్ల‌టం ఆగిపోతుంది. చిట్లిన వెంట్రుక‌లు తిరిగి య‌థాస్థానానికి వ‌స్తాయి. కొబ్బ‌రినీళ్ల‌ను జుట్టు కుదుళ్ల‌కు ప‌ట్టించినా మంచిదే. – స్నానం చేసే నీళ్ల‌లో రెండు టేబుల్ స్పూన్లు వెనిగ‌ర్‌ని వేస్తే చాలు…జుట్టు మెరుస్తుంది. ఎండి పోయి జీవం […]

Advertisement
Update:2018-09-19 13:41 IST

మ‌నం తినే, తాగే ఆహార ప‌దార్థాల్లోని కొన్నింటిని మ‌న హెయిర్‌కి కూడా పెట్టొచ్చు. అంటే జుట్టుకి అప్ల‌యి చేయ‌వ‌చ్చు. జుట్టు ఆరోగ్యాన్ని పెంచే అలాంటి ఘ‌న, ద్ర‌వ ప‌దార్థాల గురించి-

-తాజా కొబ్బ‌రి నీటిని జుట్టు చివ‌ర్ల‌కు ప‌ట్టిస్తే వెంట్రుక‌లు చిట్ల‌టం ఆగిపోతుంది. చిట్లిన వెంట్రుక‌లు తిరిగి య‌థాస్థానానికి వ‌స్తాయి. కొబ్బ‌రినీళ్ల‌ను జుట్టు కుదుళ్ల‌కు ప‌ట్టించినా మంచిదే.

– స్నానం చేసే నీళ్ల‌లో రెండు టేబుల్ స్పూన్లు వెనిగ‌ర్‌ని వేస్తే చాలు…జుట్టు మెరుస్తుంది. ఎండి పోయి జీవం లేన‌ట్టుగా ఉండే జుట్టుకి ఇది మంచి చిట్కా.

-అప్ప‌టిక‌ప్పుడు జుట్టుకి జీవం వ‌చ్చి మెరిసిపోవాలంటే దానికి షాంపైన్ ప‌ట్టించి క‌డ‌గాలి.

-గుడ్డుని గిల‌కొట్టి జుట్టుకి అప్ల‌యి చేసి త‌రువాత గాఢ‌త త‌క్కువ ఉన్న షాంపుతూ క‌డిగేస్తే జుట్టుకి బ‌లం చేకూరుతుంది.

-గుడ్డుసొన‌, నిమ్మ‌ర‌సం లేదా వెనిగ‌ర్‌, నూనె త‌దిత‌రాల‌తో త‌యారుచేసుకునే మ‌యోన్నైజ్‌ని జుట్టుకి అప్ల‌యి చేయ‌వ‌చ్చు. షాంపూ చేసిన జుట్టుకి దీన్ని ప‌ట్టించి ఇర‌వై నిముషాల‌పాటు అలాగే ఉంచి త‌రువాత క‌డిగేయాలి. జుట్టు మెత్త‌గా మృదువుగా మారుతుంది.

-షాంపూతో త‌ల స్నానం చేశాక జుట్టుని టీ డికాష‌న్‌తో క‌డిగితే కురుల‌కు మెరుపు, ఆరోగ్యం కూడా.

-ఒక క‌ప్పు పెరుగు లేదా యోగుర్ట్‌ని తీసుకుని త‌ల‌కు ప‌ట్టించి పావుగంట త‌రువాత క‌డిగేస్తే చ‌ర్మంపైని మృత‌క‌ణాలు తొల‌గిపోతాయి. అలాగే చుండ్రు స‌మ‌స్య త‌గ్గుతుంది.

-రెండు టేబుల్ స్పూన్ల తేనెని తీసుకుని దాన్ని టేబుల్ స్పూను ఆలివ్ ఆయిల్‌తో క‌లిపి బాగా మిక్స్ చేసి త‌ల‌కు హెయిర్ మాస్క్‌లా వేయాలి. ఇర‌వై నిముషాల త‌రువాత జుట్టుని క‌డిగేయాలి. దీనివ‌ల‌న జుట్టు చాలా మృదువుగా మారుతుంది.

Tags:    
Advertisement

Similar News