శైలజారెడ్డి అల్లుడు ఫస్ట్ వీకెండ్ వసూళ్లు

నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ ఫస్ట్ వీకెండ్ శైలజారెడ్డి అల్లుడు మెరిశాడు. ఏకంగా 4 రోజుల్లో 18 కోట్ల రూపాయల షేర్ రాబట్టాడు. మరీ ముఖ్యంగా నైజాంలో శైలజారెడ్డి అల్లుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. 4 రోజుల్లోనే ఏకంగా 5 కోట్లకు పైగా షేర్ తెచ్చుకున్నాడు. నాగచైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచిన శైలజారెడ్డి అల్లుడు.. లాంగ్ రన్ లో చైతూ కెరీర్ లోనే అత్యథిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలుస్తుందని ట్రేడ్ భావిస్తోంది. మారుతి దర్శకత్వంలో […]

Advertisement
Update:2018-09-17 14:34 IST

నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ ఫస్ట్ వీకెండ్ శైలజారెడ్డి అల్లుడు మెరిశాడు. ఏకంగా 4 రోజుల్లో 18 కోట్ల రూపాయల షేర్ రాబట్టాడు. మరీ ముఖ్యంగా నైజాంలో శైలజారెడ్డి అల్లుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. 4 రోజుల్లోనే ఏకంగా 5 కోట్లకు పైగా షేర్ తెచ్చుకున్నాడు.

నాగచైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచిన శైలజారెడ్డి అల్లుడు.. లాంగ్ రన్ లో చైతూ కెరీర్ లోనే అత్యథిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలుస్తుందని ట్రేడ్ భావిస్తోంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ, పీడీవీ ప్రసాద్ నిర్మించారు. అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించింది. తెలుగు రాష్ట్రాల్లో శైలజారెడ్డి అల్లుడు సినిమాకు మొదటి వారాంతంలో వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి.

నైజాం – రూ. 5.24 కోట్లు
సీడెడ్ – రూ. 2.36 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 2.60 కోట్లు
ఈస్ట్ – రూ. 1.36 కోట్లు
వెస్ట్ – రూ. 0.83 కోట్లు
గుంటూరు – రూ. 1.36 కోట్లు
కృష్ణా – రూ. 0.84 కోట్లు
నెల్లూరు – రూ. 0.49 కోట్లు

Tags:    
Advertisement

Similar News