3 రోజుల్లో 23 కోట్లు…. నిజమేనా?

నాగచైతన్య, అను ఎమ్మాన్యుయేల్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా శైలజారెడ్డి అల్లుడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వినాయకచవితి కానుకగా థియేటర్లలోకి వచ్చింది. మొదటి రోజు వసూళ్లు బాగానే వచ్చాయి. అయితే కట్ చేస్తే, 3 రోజుల్లో 23 కోట్లు అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. సరిగ్గా ఇక్కడే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిజానికి నాగచైతన్య సినిమాకు 3 రోజుల్లో 23 కోట్లు వచ్చాయంటే నమ్మొచ్చు. అతడికున్న ఫ్యాన్ బేస్ అలాంటిది. గతంలో రారండోయ్ వేడుక […]

Advertisement
Update:2018-09-16 06:09 IST

నాగచైతన్య, అను ఎమ్మాన్యుయేల్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా శైలజారెడ్డి అల్లుడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వినాయకచవితి కానుకగా థియేటర్లలోకి వచ్చింది. మొదటి రోజు వసూళ్లు బాగానే వచ్చాయి. అయితే కట్ చేస్తే, 3 రోజుల్లో 23 కోట్లు అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. సరిగ్గా ఇక్కడే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

నిజానికి నాగచైతన్య సినిమాకు 3 రోజుల్లో 23 కోట్లు వచ్చాయంటే నమ్మొచ్చు. అతడికున్న ఫ్యాన్ బేస్ అలాంటిది. గతంలో రారండోయ్ వేడుక చూద్దాం సినిమాకు మంచి వసూళ్లే వచ్చాయి. సో.. ఇవన్నీ లెక్కలేసుకుంటే తాజా చిత్రానికి ఇన్ని కోట్లు అంటే నమ్మొచ్చు. కానీ మొదటి రోజు నెగెటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు వచ్చాయంటే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే.

నాగచైతన్య సినిమాలు హిట్ అయితే బాగానే ఉంటాయి. ఫ్లాప్ అయితే మాత్రం ఆ వసూళ్లు చెప్పుకోవడానికే సిగ్గేస్తుంది. అంత తక్కువగా వస్తుంటాయి. అందుకే శైలజారెడ్డి అల్లుడిపై అన్ని అనుమానాలు. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే.. మార్కెట్లో మరో సినిమా లేదు.

గీతగోవిందం హవా ముగిసింది. కంచరపాలెం బాగుందంటున్నారు కానీ థియేటర్లకు వెళ్లి చూసేవాళ్లు లేరు. అందుకేనేమో.. శైలజారెడ్డి అల్లుడికి వసూళ్లు వస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News