రాజీనామాల బాటలో 'నయీం' నేతలు?
నయీం కేసులో ఇప్పటికే పలు సంచలనాలు నమోదయ్యాయి. సిట్ పోలీసులు ధ్రువీకరించకముందే… కొందరు నేతలు తమకు నయీంతో ఎలాంటి సంబంధం లేదని మీడియా ముందుకు వచ్చారు. ఓ పెద్దమనిషి అయితే.. చనిపోయేదాకా ఫోన్‌లో మాట్లాడేవాడినని చెప్పడం విశేషం. వీరందరికీ రేపో, మాపో సిట్ అధికారులు నోటీసులు జారీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రాజకీయ నేతలంతా ప్రభుత్వ ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. వీరంతా ఇప్పటికే పలువురు సుప్రీం కోర్టు, హైకోర్టు సీనియర్ న్యాయవాదులను ఈ కేసు […]
Advertisement
నయీం కేసులో ఇప్పటికే పలు సంచలనాలు నమోదయ్యాయి. సిట్ పోలీసులు ధ్రువీకరించకముందే… కొందరు నేతలు తమకు నయీంతో ఎలాంటి సంబంధం లేదని మీడియా ముందుకు వచ్చారు. ఓ పెద్దమనిషి అయితే.. చనిపోయేదాకా ఫోన్‌లో మాట్లాడేవాడినని చెప్పడం విశేషం. వీరందరికీ రేపో, మాపో సిట్ అధికారులు నోటీసులు జారీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రాజకీయ నేతలంతా ప్రభుత్వ ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. వీరంతా ఇప్పటికే పలువురు సుప్రీం కోర్టు, హైకోర్టు సీనియర్ న్యాయవాదులను ఈ కేసు విషయంలో సలహాలు తీసుకున్నారు. నయీం కేసులో విచారణకు రావాలంటూ పోలీసులు నోటీసులుజారీ చేసిన వెంటనే.. తమ పదవులకు రాజీనామా చేసే వ్యూహంలో ఉన్నారని తెలుస్తోంది.
ప్రభుత్వం తమను అన్యాయంగా ఇరికించిందని మీడియా ముందుకు వచ్చి విలపించాలని.. తరువాత విచారణకు పూర్తిగా సహకరిస్తామని ప్రజలకు చెబుతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే చాలామంది తమ రాజీనామా లేఖలను సిద్ధం చేసి ఉంచుకున్నారని తెలిసింది. అయితే, విచారణకు హాజరయ్యాక.. రాజీనామా చేయాలా? విచారణకు ముందే చేయాలా? అన్న విషయంపై మాత్రం నేతల్లో స్పష్టత లేదు. ఈ విషయంలో అధికార, ప్రతిపక్ష నేతల ఆలోచనలు వేరువేరుగా ఉన్నాయి. నోటీసులు అందుకున్న వెంటనే రాజీనామా చేసేందుకు అధికార పార్టీ నేతలు సిద్ధమవుతుండగా.. ప్రతిపక్షంలో ఉన్న నేతలు మాత్రం విచారణ మధ్యలో రాజీనామా చేయాలని చూస్తున్నారని తెలిసింది. ఎందుకంటే.. వీరు రాజీనామా చేసినా.. చేయకున్నా.. వీరిపై స్పీకర్ వేటు వేసే ప్రమాదముంది కాబట్టి! అందుకే, ప్రతిపక్ష నేతలు తమ రాజీనామాను ప్రభుత్వంపై అస్త్రంలా వాడాలనుకుంటున్నారు. తమను తప్పుడు కేసులో ఇరికించి వేధింపులకు పాల్పడుతున్న సర్కారు తీరుకు నిరసనగా రాజీనామా చేస్తున్నాం అన్న కలరింగ్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
Advertisement