ఐశ్వర్య రాయ్‌కి అడ్డంకిగా మారిన పాకిస్తాన్ యాక్టర్!

అమ్మగా మారిన తర్వాత అందాల సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్ తిరిగి బాలివుడ్‌లో కమ్‌బ్యాక్ మూవీగా ‘జజ్బా’ చేసినా, ఆ సినిమా ఆమెకు అంతగా పేరూ తేలేదు, సినిమా ఆడలేదు. ఆపైన నటించిన ‘సరబ్‌జిత్  అనే బయోపిక్ కూడా విపరీతంగా నిరాశ పరిచింది. ఇక ఇప్పుడు ‘ఏ దిల్ హై ముష్కిల్’ అనే సినిమా బిగ్ బ్యానర్ ‘ధర్మ ప్రొడక్షన్స్’ ద్వారా విడుదలకు రెడీగా ఉంది. ఈ సినిమా ట్రెయిలర్ లో ఐశ్వర్య మరియు యువనటుడు రణ్‌బీర్ మధ్య […]

Advertisement
Update:2016-09-26 11:01 IST
అమ్మగా మారిన తర్వాత అందాల సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్ తిరిగి బాలివుడ్‌లో కమ్‌బ్యాక్ మూవీగా ‘జజ్బా’ చేసినా, ఆ సినిమా ఆమెకు అంతగా పేరూ తేలేదు, సినిమా ఆడలేదు. ఆపైన నటించిన ‘సరబ్‌జిత్ అనే బయోపిక్ కూడా విపరీతంగా నిరాశ పరిచింది. ఇక ఇప్పుడు ‘ఏ దిల్ హై ముష్కిల్’ అనే సినిమా బిగ్ బ్యానర్ ‘ధర్మ ప్రొడక్షన్స్’ ద్వారా విడుదలకు రెడీగా ఉంది. ఈ సినిమా ట్రెయిలర్ లో ఐశ్వర్య మరియు యువనటుడు రణ్‌బీర్ మధ్య హాట్ సీన్స్ చూసి, ఈ సినిమా ఐశ్వర్య కమ్‌బ్యాక్ మూవీ అయితే ఎంత బాగుండేది అని అనుకుంటున్నారు. అంత రెస్‌పాన్స్ వచ్చిన సినిమాకి ఇప్పుడు ఒక బెదిరింపు వచ్చింది. మహారాష్ట్ర నవనిర్మాణ్ సమితి ఈ సినిమా రిలీజ్ అడ్డుకుంటామని హెచ్చరిక జారీ చేసింది. కారణం? ఈ సినిమాలో ఫవాద్ ఖాన్ అనే పాకిస్తాన్ అందగాడు ఒక హీరో. ఇప్పుడున్న పరిస్థితిలో, ఒక పాకిస్తాన్ నటుడి సినిమాను విడుదల కానివ్వమని బెదిరిస్తున్నారట. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే!
Tags:    
Advertisement

Similar News