మనిషిని గుద్దేసి.. కారుపై అలాగే ఈడ్చుకెళ్లారు!
మనుషుల్లో మానవత్వం రోజురోజుకు కనుమరుగుతోందని మరోసారి రుజువైంది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం రుజువు చేసింది. జడ్చర్లలో నిమ్మబాయిగడ్డకు చెందిన శ్రీను (35) రోడ్డు దాటుతుండగా ఎరుపు రంగు చవర్లేట్ కారు వేగంగా వచ్చి ఢీకొంది. తీవ్రగాయాలతో వెంటనే శ్రీను అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటన జరిగిన తరువాత డ్రైవర్ కారు ఆపలేదు. అలాగే ఒకటిన్నర కిలోమీటరు దూరం శవాన్ని కారుపై ఉండగానే ఈడ్చుకెళ్లాడు. ఇది గమనించిన కొందరు యువకులు కారును వెంబడించారు. […]
Advertisement
మనుషుల్లో మానవత్వం రోజురోజుకు కనుమరుగుతోందని మరోసారి రుజువైంది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం రుజువు చేసింది. జడ్చర్లలో నిమ్మబాయిగడ్డకు చెందిన శ్రీను (35) రోడ్డు దాటుతుండగా ఎరుపు రంగు చవర్లేట్ కారు వేగంగా వచ్చి ఢీకొంది. తీవ్రగాయాలతో వెంటనే శ్రీను అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటన జరిగిన తరువాత డ్రైవర్ కారు ఆపలేదు. అలాగే ఒకటిన్నర కిలోమీటరు దూరం శవాన్ని కారుపై ఉండగానే ఈడ్చుకెళ్లాడు. ఇది గమనించిన కొందరు యువకులు కారును వెంబడించారు. దాదాపు కిలోమీటరు తరువాత ఓ బ్రిడ్జి సమీపంలో కారును వదిలి పారిపోయాడు. కారుపై శవం అలాగే ఉండటం గమనార్హం. కారు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన చంద్రకళ అనే మహిళ పేరిట రిజిస్టర్ అయినట్లు పోలీసులు గుర్తించారు. మృతుడు కూలీ పనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నట్టు సమాచారం. కేసు నమోదు చేసుకున్న జడ్చర్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గతంలో నల్లగొండలో..
2016, జనవరి మొదటివారంలో నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రి జంక్షన్ వద్ద రోడ్డు దాటుతున్న వృద్ధుడు కొమిరెల్లి వెంకట్‌రెడ్డి(65)ని హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వెంకట్‌రెడ్డి అమాంతం గాల్లోకి ఎగిరి అదే కారుపై పడి మృతి చెందాడు. కానీ, కారు డ్రైవర్ రహీంఖాన్ మాత్రం ఆ వాహనాన్ని ఆపకుండా 15 కిలోమీటర్ల దూరం అలాగే కారుపై మృతదేహంతోనే వెళ్లాడు. వాహనదారులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పుడే అయిటిపాముల వద్ద కారు రిపేర్‌తో ఆగిపోగా పోలీసులు కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Advertisement