అయ్య బాబోయ్... ఆదా శర్మ...

చూడ్డానికి అందంగా కనిపిస్తుంది. యాక్టింగ్ కూడా బాగా చేస్తంది. ఆదాశర్మ గురించి చెప్పుకోవడానికి ఇంతకంటే ఇంకేముంటుంది చెప్పండి. కొన్ని ఫంక్షన్లలో డాన్స్ పర్ ఫార్మెన్స్ కూడా బాగా చేసిందని చెప్పుకోవాలి. కానీ ఇవి మాత్రమే కాదు… ఆదాశర్మ గురించి చెప్పుకోవాలంటే అంతకుమించి అనే డైలాగ్ ను రిపీట్ చేయాల్సి ఉంటుంది. అవును… ఆదా శర్మ డేరింగ్ అండ్ డాషింగ్. ఓ పిట్ట గోడపై కష్టమైన యోగాసనం వేసింది అదాశర్మ. పిట్టగోడ అంటే అది అలాంటిఇలాంటి పిట్టగోడ కాదు. […]

Advertisement
Update:2016-09-20 08:41 IST

చూడ్డానికి అందంగా కనిపిస్తుంది. యాక్టింగ్ కూడా బాగా చేస్తంది. ఆదాశర్మ గురించి చెప్పుకోవడానికి ఇంతకంటే ఇంకేముంటుంది చెప్పండి. కొన్ని ఫంక్షన్లలో డాన్స్ పర్ ఫార్మెన్స్ కూడా బాగా చేసిందని చెప్పుకోవాలి. కానీ ఇవి మాత్రమే కాదు… ఆదాశర్మ గురించి చెప్పుకోవాలంటే అంతకుమించి అనే డైలాగ్ ను రిపీట్ చేయాల్సి ఉంటుంది. అవును… ఆదా శర్మ డేరింగ్ అండ్ డాషింగ్. ఓ పిట్ట గోడపై కష్టమైన యోగాసనం వేసింది అదాశర్మ. పిట్టగోడ అంటే అది అలాంటిఇలాంటి పిట్టగోడ కాదు. ఏకంగా ఓ భవనంలో 24వ అంతస్తులో ఉన్న పిట్ట గోడ అది. అక్కడ్నుంచి కిందపడితే అంతే సంగతి. అలాంటి పిట్టగోడపై మన ఆదాశర్మ యోగా చేసింది. శరీరాన్ని విల్లులా వంచుతూ యోగాసనాలు వేసింది. పిల్లలు ఎవరూ ఇలాంటి ప్రయత్నాలు చేయవద్దని హెచ్చరించింది కూడా. ప్రస్తుతం ఆమె కమెండో-2 సినిమాలో నటిస్తోంది. ఈ మూవీలో రిస్కీ ఫైట్స్ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంది. ఆ ధైర్యంతోనే ఇలా యోగా చేస్తూ, ఆ ఫొటోలు, వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆదా శర్మ ధైర్యానికి అంతా అవాక్కయ్యారు. అయితే భవిష్యత్తులో ఇలాంటి పనులు చేయవద్దంటూ సోషల్ మీడియాలో ఆమెకు చాలామంది సలహాలు కూడా ఇచ్చారు. ఆ సలహాల్ని ఆదాశర్మ పాటిస్తుందనే ఆశిద్దాం.

Full View

Tags:    
Advertisement

Similar News