ప్రియురాలిని పాతిపెట్టి.. దానిపై మంచమేసుకుని నిద్రపోయాడు!
కోపం మనిషిని ఉన్మాదిని చేస్తుందన్న ఘటన మరోసారి నిరూపితమైంది. క్షణికావేశంలో ప్రియురాలిని చంపిన ఓ యువకుడు పొరుగింటి వ్యక్తిని బెదిరించే క్రమంలో నోరుజారడంతో విషయం బయటపడింది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌లో చంద్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. కాజోల్, ఘన్‌శ్యాం అనేయువతీ యువకులు ప్రేమికులు. ఇటీవల వీరిద్దరి మధ్య ఓ విషయమై గొడవ జరిగింది. మాటామాటా పెరిగింది. అంతే పదునైన ఆయుధంతో కాజోల్ తలపై కొట్టాడు. దెబ్బగట్టిగా తగలడంతో అక్కడికక్కడే కాజోల్ కన్నుమూసింది. ప్రియురాలి శవాన్ని […]
Advertisement
కోపం మనిషిని ఉన్మాదిని చేస్తుందన్న ఘటన మరోసారి నిరూపితమైంది. క్షణికావేశంలో ప్రియురాలిని చంపిన ఓ యువకుడు పొరుగింటి వ్యక్తిని బెదిరించే క్రమంలో నోరుజారడంతో విషయం బయటపడింది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌లో చంద్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. కాజోల్, ఘన్‌శ్యాం అనేయువతీ యువకులు ప్రేమికులు. ఇటీవల వీరిద్దరి మధ్య ఓ విషయమై గొడవ జరిగింది. మాటామాటా పెరిగింది. అంతే పదునైన ఆయుధంతో కాజోల్ తలపై కొట్టాడు. దెబ్బగట్టిగా తగలడంతో అక్కడికక్కడే కాజోల్ కన్నుమూసింది. ప్రియురాలి శవాన్ని ఏం చేయాలో తెలియలేదు. తన గదిలోనే ఆమెను పాతిపెట్టాడు. దానిపై మంచమేసుకుని మూడురోజులుగా పడుకుంటున్నాడు. అయితే, పొరుగింటి వ్యక్తితో ఘన్‌శ్యాం గొడవపడ్డాడు. ఆవేశంలో నా ప్రియురాలిని చంపినట్లు నిన్నూ చంపేస్తాను అని నోరుజారాడు. దీంతో విషయం పోలీసుల వద్దకు వెళ్లింది. అప్పటికే కాజోల్ అదృశ్యంపై వెదుకుతున్న పోలీసులు ఘన్‌శ్యాం గదిని తనిఖీ చేశారు. మంచం కింద ఆమెను పాతిపెట్టినట్లు గుర్తించారు. ఘన్‌శ్యాంను అరెస్టు చేసి రిమాండ్ కు తరలిరంచారు.
Advertisement