అధికారం నుంచి కొడుకును తప్పించిన ములాయం

ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో ములాయంసింగ్‌ యాదవ్‌, అఖిలేష్‌ యాదవ్‌ ఎత్తుకు పైఎత్తులేస్తూ చదరంగం ఆటను మరిపిస్తున్నారు. కొన్ని నెలల క్రితం ములాయం సోదరుడు శివపాల్‌ యాదవ్‌ను దూరంగా పెట్టాడు అఖిలేష్‌ యాదవ్‌. గ్యాంగ్‌స్టర్‌ ముక్తార్‌ అన్సారీ పార్టీని సమాజ్‌వాది పార్టీలో విలీనం చేయడానికి శివపాల్‌ యాదవ్‌ అంగీకరిస్తే అఖిలేష్‌ వీలుకాదన్నారు. దాంతో ఇద్దరి మధ్య విబేధాలు ఎక్కువయ్యాయి. జ్యోక్యం చేసుకున్న ములాయం తమ్ముడికి అండగా నిలిచాడు. ములాయం చిన్న తమ్ముడైన శివపాల్‌ యాదవ్‌ పార్టీకి ప్రధాన స్ట్రాటజిస్ట్‌. ఇతర […]

Advertisement
Update:2016-09-14 05:49 IST

ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో ములాయంసింగ్‌ యాదవ్‌, అఖిలేష్‌ యాదవ్‌ ఎత్తుకు పైఎత్తులేస్తూ చదరంగం ఆటను మరిపిస్తున్నారు. కొన్ని నెలల క్రితం ములాయం సోదరుడు శివపాల్‌ యాదవ్‌ను దూరంగా పెట్టాడు అఖిలేష్‌ యాదవ్‌. గ్యాంగ్‌స్టర్‌ ముక్తార్‌ అన్సారీ పార్టీని సమాజ్‌వాది పార్టీలో విలీనం చేయడానికి శివపాల్‌ యాదవ్‌ అంగీకరిస్తే అఖిలేష్‌ వీలుకాదన్నారు. దాంతో ఇద్దరి మధ్య విబేధాలు ఎక్కువయ్యాయి. జ్యోక్యం చేసుకున్న ములాయం తమ్ముడికి అండగా నిలిచాడు.

ములాయం చిన్న తమ్ముడైన శివపాల్‌ యాదవ్‌ పార్టీకి ప్రధాన స్ట్రాటజిస్ట్‌. ఇతర పార్టీలతో ఒప్పందాలు, విలీనాలు, పార్టీ ఫండ్స్‌ సేకరణ మొదలైన కీలక అంశాలు చూసేవాడు. అలాంటి తమ్ముడిని కొడుకు దూరంగా పెట్టడం ములాయంకి నచ్చలేదు. పైగా కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఈ పరిస్థితుల్లో తమ్ముడిని దూరం చేసుకుంటే పార్టీ దెబ్బతింటుందని ములాయం బాధ.

ఈ నేపధ్యంలో పినతండ్రిని, తండ్రి వెనుకేసుకురావడంతో అఖిలేష్‌ పినతండ్రికి సన్నిహితులైన ఇద్దరు మంత్రులను అవినీతి ఆరోపణలపై పదవుల నుంచి తప్పించాడు. రెండు నెలల క్రితం పిన తండ్రి బలవంతంమీద ప్రధాన కార్యదర్శిగా చేర్చుకున్న దీపక్‌ సింఘాల్‌ని మంగళవారం రాత్రి ఆ పదవి నుంచి తప్పించాడు. ఈయన ములాయంకు కూడా సన్నిహితుడు, వివాదాస్పదుడు. ఆయన వెంటనే సహాయంకోసం ములాయంను కలిశాడు. ముఖ్యమంత్రి విధుల్లో నేను జ్యోక్యం చేసుకోనని ములాయం చెప్పాడు.

అయితే సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడైన ములాయం తనకున్న అధికారాలతో కొడుకు అఖిలేష్‌ను ఉత్తరప్రదేశ్‌ పార్టీ అధ్యక్ష పదవినుంచి తొలగించి తమ్ముడు శివపాల్‌ యాదవ్‌కు ఆ పదవిని కట్టబెట్టాడు.

దీనికి స్పందించిన అఖిలేష్‌ వెంటనే శివపాల్‌ యాదవ్‌ వద్దనున్న ముఖ్యమైన శాఖలను కత్తిరించి ఆయనకు అప్రధానమైన సోషల్‌ వెల్‌ఫేర్‌ శాఖను అప్పగించారు.

ఇప్పుడు బాల్‌ ములాయం కోర్టులో ఉంది. ఇప్పుడు తరువాతి ఎత్తు వేయాల్సింది ములాయం. తమ్ముడి అధికారాలు కుదించినందుకు కొడుకును ముఖ్యమంత్రి పీఠం నుంచి దించుతాడా? లేక ఇదంతా రాజకీయ చదరంగంలో ఎత్తులేనా? వచ్చే ఎన్నికల్లో గెలుపు అవకాశాలు తక్కువగా కనిపిస్తున్న సమయంలో పార్టీని గట్టెక్కించగల తమ్ముడిని వదులుకోవడం ఇష్టంలేక ఒక అవగాహనతో కొడుకుపై చర్యలు తీసుకుంటున్నాడా? త్వరలో తేలుతుంది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News