నయీం కేసులో పెద్ద చేపలను లాగేది ఎల్లుండే?
నయీం పాపాల చిట్టా పోలీసుల చేతికి దొరికింది. తాను పోయినా… తనతో సావాసం చేసినవారంతా శిక్ష అనుభవించాలన్న నయీం ఆలోచనే పోలీసులకు శ్రమ తగ్గించింది. ఈ మేరకు నయీం నివాసంలో లిఖిత, దృశ్య, శ్రావ్య, సాంకేతిక ఆధారాలు గుట్టలుగా పోలీసులకు దొరికాయి. మొత్తానికి ఈ కేసులో పెద్దచేపలకు సంబంధించి పోలీసులు ఏనాడో గాలాలు, వలలు వేసి కూర్చున్నారు. పెద్ద చేపలన్నీ చిక్కాయి. సీఎం ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. పైకి మాత్రం అంతా ప్రశాంతంగానే కనిపిస్తోంది. తాజాగా సీఎం […]
Advertisement
నయీం పాపాల చిట్టా పోలీసుల చేతికి దొరికింది. తాను పోయినా… తనతో సావాసం చేసినవారంతా శిక్ష అనుభవించాలన్న నయీం ఆలోచనే పోలీసులకు శ్రమ తగ్గించింది. ఈ మేరకు నయీం నివాసంలో లిఖిత, దృశ్య, శ్రావ్య, సాంకేతిక ఆధారాలు గుట్టలుగా పోలీసులకు దొరికాయి. మొత్తానికి ఈ కేసులో పెద్దచేపలకు సంబంధించి పోలీసులు ఏనాడో గాలాలు, వలలు వేసి కూర్చున్నారు. పెద్ద చేపలన్నీ చిక్కాయి. సీఎం ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. పైకి మాత్రం అంతా ప్రశాంతంగానే కనిపిస్తోంది. తాజాగా సీఎం కూడా ఎవరినీ వదిలిపెట్టవద్దని స్పష్టం చేశారు. ఇంకేముంది చేపలను లాగేందుకు ఎల్లుండి ముహూర్తం ఖరారైంది. వినాయక నిమజ్జనం ముగిసిన మరునాడే అంటే.. ఎల్లుండి పోలీసులు గాలాలు లాగడం మొదలు పెట్టనున్నారు. ఇక అలజడి మొదలు కానుంది. ఈ కేసులో ప్రజాప్రతినిధులు, పోలీసులు భాగస్వాములు అయి ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ పోలీసులు ఇంతవరకూ ఎవరి పాత్రనూ ధ్రువీకరించలేదు. శుక్రవారం రాష్ట్రంలో భారీ సంచలనాలు నమోదుకానున్నాయి.
నలుగురు ప్రజాప్రతినిధులను పోలీసులు అరెస్టు చేయనున్నారన్న వార్త మీడియాలో, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర వేడిని పుట్టించింది. ఆ నలుగురు ఎవరా? అన్న ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది. మీడియాకు వారి పేర్లు తెలిసినా… పోలీసులు అరెస్టు చేసేంతవరకు వెల్లడించలేని పరిస్థితి. దీంతో అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నయీంతో అంటకాగి ప్రజలను ఇబ్బందులు పెట్టిన ఎవరినీ వదలవద్దని, ముందు అధికార పార్టీలోని వారినే అరెస్టు చేయాలని సీఎం ఆదేశించారని సమాచారం. నయీం ఎన్ కౌంటర్ తరువాత కొందరు అధికార పార్టీ నేతలు కేసీఆర్ ను కలిసి తమను తప్పించాలంటూ కేసీఆర్ ను కోరదామనుకున్నా.. సీఎం వారికి ఆ అవకాశం ఇవ్వలేదు. నిందితుల జాబితాలో ఉన్న ఎవరికీ ఇప్పటి వరకూ సీఎం అపాయింట్మెంట్ దొరకలేదు. దీంతో వారంతా తమ అరెస్టు తప్పదన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే, మీడియాకు, సన్నిహితులకు దూరంగా ఉన్నారు. కనీసం పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకు సైతం హాజరుకావడం లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక గుండెలు చేతబట్టుకుని కూర్చున్నారని సమాచారం.
Advertisement