రూ. 530 కోట్లా?.. కొత్తపల్లి గీతకు గట్టి షాక్‌ ఇచ్చిన కేసీఆర్‌ సర్కార్

వైసీపీ తరపున గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన అరకు ఎంపీ కొత్తపల్లి గీతకు గట్టి షాక్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్‌ రాయదుర్గం వద్ద కొత్తపల్లి గీత ఆధీనంలో ఉన్న 53ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 53ఎకరాలను ప్రభుత్వ భూమిగా గుర్తించారు. అయితే కొత్త పల్లి గీత మాత్రం ఇది అన్యాయమంటున్నారు. 53 ఎకరాల భూమిని 8ఏళ్ల క్రితమే తాను కొనుగోలు చేశానంటున్నారు. దాని విలువ ప్రస్తుతం రూ. 530 కోట్లని చెప్పారు. ఎలాంటి నోటీసులు కూడా […]

Advertisement
Update:2016-09-12 06:25 IST

వైసీపీ తరపున గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన అరకు ఎంపీ కొత్తపల్లి గీతకు గట్టి షాక్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్‌ రాయదుర్గం వద్ద కొత్తపల్లి గీత ఆధీనంలో ఉన్న 53ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 53ఎకరాలను ప్రభుత్వ భూమిగా గుర్తించారు. అయితే కొత్త పల్లి గీత మాత్రం ఇది అన్యాయమంటున్నారు. 53 ఎకరాల భూమిని 8ఏళ్ల క్రితమే తాను కొనుగోలు చేశానంటున్నారు. దాని విలువ ప్రస్తుతం రూ. 530 కోట్లని చెప్పారు. ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వకుండా రాత్రికి రాత్రే తన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని ఆరోపించారు.

హైదరాబాద్‌లో తన భూములకు రక్షణ లేకుండా పోయిందన్నారు. రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్, టీఎస్‌ఐఎస్‌ చైర్మన్ ఒత్తిడితోనే తన భూమిని లాగేసుకున్నారని చెప్పారు. ఇలా చేయడం ప్రభుత్వానికే చెడ్డపేరని విమర్శించారు. 53 ఎకరాలు ప్రభుత్వ భూమి కాదని గీత చెప్పారు. మొత్తం మీద ఇప్పటికే అనేక వివాదాల్లో ఉన్న కొత్తపల్లి గీతకు ఏకంగా రూ. 530 కోట్ల విలువైన భూమి చేజారిపోవడం పెద్ద దెబ్బే. ఆర్ధికంగా అంతంత మాత్రం స్థితినుంచి వచ్చిన కొత్తపల్లి గీత కుటుంబం ఇన్ని కోట్ల ఆస్తులు సంపాదించడం చూసి ఆమె గురించి తెలిసిన వాళ్లు ఆశ్చర్యపోతున్నారు. భూసేకరణ, ప్రభుత్వ భూ రక్షణ విభాగాల్లో గ్రూప్ – 1 ఆఫీసరుగా పనిచేసిన ఈమె ఇన్ని వందల కోట్ల రూపాయల విలువైన భూములు సంపాదించడంపై పౌరులు ముక్కున వేలేసుకుంటున్నారు.

Click on Image to Read:

 

 

 

 

 

 

 

 

 

Tags:    
Advertisement

Similar News