పవన్‌కు సపోర్ట్ షూటర్లు సిద్ధం... కానీ

కమ్యూనిస్టులపై తనకు గౌరవం ఉందని పవన్‌ ప్రకటించడమే ఆలస్యం ఆయనకు సీపీఐ నేతలు రక్షణగా ముందుకొస్తున్నారు. సీపీఎంకు సీపీఐకు తేడా కనిపెట్టడంలో పదేపదే తికమకపడుతున్న పవన్‌ కల్యాణ్ కాకినాడ సభలోనే కాదు…శనివారం రాత్రి ఒక ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ పప్పులో కాలేశారు. సీపీఎంతో తాను కలిసి పనిచేస్తానని చెబుతూనే ఆ పార్టీ కార్యదర్శి రామకృష్ణతో త్వరలోనే సంప్రదింపులు జరుపుతానని చెప్పారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పార్టీ పేరును మాత్రం సీపీఎం అంటూనే కార్యదర్శి రామకృష్ణ అని […]

Advertisement
Update:2016-09-11 07:14 IST

కమ్యూనిస్టులపై తనకు గౌరవం ఉందని పవన్‌ ప్రకటించడమే ఆలస్యం ఆయనకు సీపీఐ నేతలు రక్షణగా ముందుకొస్తున్నారు. సీపీఎంకు సీపీఐకు తేడా కనిపెట్టడంలో పదేపదే తికమకపడుతున్న పవన్‌ కల్యాణ్ కాకినాడ సభలోనే కాదు…శనివారం రాత్రి ఒక ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ పప్పులో కాలేశారు. సీపీఎంతో తాను కలిసి పనిచేస్తానని చెబుతూనే ఆ పార్టీ కార్యదర్శి రామకృష్ణతో త్వరలోనే సంప్రదింపులు జరుపుతానని చెప్పారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పార్టీ పేరును మాత్రం సీపీఎం అంటూనే కార్యదర్శి రామకృష్ణ అని పవన్ పదేపదే చెప్పడం. చూస్తుంటే రామకృష్ణ మీద పవన్‌కు ప్రత్యేక ఆసక్తి ఉన్నట్టుగా ఉంది. అదే సమయంలో సీపీఐ రాష్ట్ర విభజనను వ్యతిరేకించలేదు.

రాష్ట్ర విభజనను వ్యతిరేకించింది సీపీఎం. రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన సమయంలోనే సీపీఎంకు తాను దాసోహమయ్యానని కాకినాడ సభలో చెప్పారు. మరి సీపీఎంకు దాసోహమైన పవన్‌ కల్యాణ్‌… సీపీఐ రామకృష్ణతో చర్చలెలా జరుపుతారో అర్థం కావడం లేదు. బహుశా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు గురించి పవన్‌కు తెలియదా?. లేక ఆయన నచ్చడం లేదా?. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే… పవన్‌ తన పేరును పదేపదే పలికేసరికి సీపీఐ రామకృష్ణ కూడా చాలా పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారు. పవన్‌కల్యాణ్‌పై ఎంపీలు విమర్శలు చేయడం సిగ్గు చేటని రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయని ఎంపీలు ఇప్పుడు సిగ్గు లేకుండా పవన్ను విమర్శిస్తారా అని రామకృష్ణ విమర్శించారు. అయితే పవన్‌, రామకృష్ణ మధ్య ఒక విషయంలో సారుప్యత కనిపిస్తుంది. ఇద్దరూ కూడా ఎంపీలు, వెంకయ్యనాయుడుపై ఒంటికాలిపై లేస్తుంటారు. అయితే సీపీఎంతో కలిసి పనిచేస్తానంటున్న పవన్‌ కల్యాణ్‌ పదేపదే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో చర్చలు జరుపుతా అని ఎందుకంటున్నారో స్పష్టత ఇస్తే బాగుంటుంది. మొత్తానికి రామకృష్ణ రూపంలో పవన్‌ కల్యాణ్‌కు ఒక మంచి సపోర్ట్ షూటర్ దొరికినట్టుగానే ఉంది.

Click on Image to Read:

 

Tags:    
Advertisement

Similar News