కటౌట్ ఉంటే సరిపోదు... క్లారిటీ కూడా ఉండాలి...

కాంగ్రెస్ వెన్నులో పొడిస్తే..బీజేపీ నేరుగా పొట్టలో పొడిచిందన్నావు. చిరంజీవిని నమ్మి మోసపోయిన జనం నిన్ను నమ్ముతున్నారు. కనీసం నువ్వాయినా పొట్టలో పొడవకు. నీ మీద పెట్టుకున్న నమ్మకానికి, నువ్వేం చేస్తావో చెప్పు! హోదా కోసం అంతా చేతులెత్తేస్తే పోరాడుతాలాంటి కబుర్లు వద్దు. ఢిల్లీలో ఎప్పుడు పోరాడుతావో చెప్పు! హోదా గోదాలో ఎప్పుడు దిగుతావో చెప్పు! APలో ఏమంత పాత్ర లేని BJPని తిడితే ప్రయోజనం లేదు. భారత దేశం నా మాతృభూమి అంటూ.. ఉత్తర-దక్షిణ భారతాల మధ్య […]

Advertisement
Update:2016-09-10 06:18 IST

కాంగ్రెస్ వెన్నులో పొడిస్తే..బీజేపీ నేరుగా పొట్టలో పొడిచిందన్నావు. చిరంజీవిని నమ్మి మోసపోయిన జనం నిన్ను నమ్ముతున్నారు. కనీసం నువ్వాయినా పొట్టలో పొడవకు. నీ మీద పెట్టుకున్న నమ్మకానికి, నువ్వేం చేస్తావో చెప్పు!

హోదా కోసం అంతా చేతులెత్తేస్తే పోరాడుతాలాంటి కబుర్లు వద్దు. ఢిల్లీలో ఎప్పుడు పోరాడుతావో చెప్పు! హోదా గోదాలో ఎప్పుడు దిగుతావో చెప్పు!

APలో ఏమంత పాత్ర లేని BJPని తిడితే ప్రయోజనం లేదు. భారత దేశం నా మాతృభూమి అంటూ.. ఉత్తర-దక్షిణ భారతాల మధ్య వైరుధ్యాలు అవసరమా? టీడీపీని నేరుగా తిట్టలేని బలహీనత… నీ అరుపుల చాటున వినిపూస్తూనే ఉంది.

నీకు బలం ఉంది. అభిమాన ధనం ఉంది.

సీమాంధ్రలో తెలంగాణ పాట పాడటం నచ్చింది. తెలాంగాణలో సీమాంధ్రుల గొంతుకగా నిన్ను లక్షలాదిమంది అభిమానిస్తున్నారు. కానీ రాజధాని విషయంలో నువ్వు చేసింది ఏమిటి? మూడు పంటలు పండే 33వేల ఎకరాల మాగాణులను రాజధాని పేరుతో లాక్కుంటే ఆపగలిగావా? రేపు తిండి గింజలు లేక దిగుమతి చేసుకోవాల్సి వస్తే, ఆ పాపంలో భాగం లేదా?? ప్యాకేజీ పవన్ ఆరోపణలకు బాదులివ్వగలిగావా? క్లారిటీ లేని కరెస్పాండెన్స్ పాలిటిక్స్ తో చంద్రబాబు లాస్ట్ హోప్ పవన్ కళ్యాణ్ అని అనేకసార్లు ప్రూవ్ చేసావు? నిన్న వెంకయ్యని కడిగిపడేసిన నోటితో చంద్రబాబుని పల్లెత్తు మాట అన్నావా? అతి కీలకమైన 2% ఓట్లను ప్రభావితం చేసి, గత ఎన్నికల్లో బాబు సిఎం అవ్వడానికి దోహదం చేశావు. కానీ నీకు ఇచ్చిన గౌరవం ఏంటి?

నీకు లక్షల మంది అభిమానులున్నారు. నీ బలం బలహీనత కూడా వాళ్ళే! నీలాగే వాళ్ళూ ఆవేశపరులు. నీ స్పీచ్ తో అప్పుడప్పుడు ఇలా ఊగిపోయి, ఊపేయ్యడమే కాదు., జనసేన లక్ష్యం ఏమిటో చెప్పు. దిశానిర్దేశం చేయకపోతే, నిన్ను నమ్ముకుని రేపు వాళ్ళు అధికార ప్రతిపక్ష కార్యకర్తల చేతుల్లో దెబ్బలు తింటారు.

ప్రశ్నలు వేయడానికి వందల మంది విలేకరులు ఉన్నారు. సమాధానం చూపించేవాడే నాయకుడు!! ప్రజలకు కావాల్సింది క్వశ్చన్ బ్యాంకు కాదు.. క్వశ్చన్ మార్కు లేని నాయకుడు!!


-ఓ అభిమాని

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News