మీడియా పాయింట్‌ వద్ద టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల బాహాబాహీ

ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్షాల మధ్య యుద్ధం అసెంబ్లీ బయట కూడా సాగింది. మీడియా పాయింట్ వేదికగా రెండుపార్టీల ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. వైసీపీ మహిళా ఎమ్మెల్యేలంతా కలిసి మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతుండగా… టీడీపీకి చెందిన కొందరు పురుష ఎమ్మెల్యేలు వచ్చారు. వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు ఉత్తరాంధ్ర సమస్యలు, రైల్వే జోన్‌పై మాట్లాడుతుండగా టీడీపీ ఎమ్మెల్యేలు గొడవకు దిగారు. వారు మాట్లాడేది మీడియాకు వినిపించకుండా నినాదాలు చేశారు. పది నిమిషాల్లో తామువెళ్లిపోతామని ఆ తర్వాత మాట్లాడుకోవాలని వైసీపీ మహిళా […]

Advertisement
Update:2016-09-10 04:56 IST

ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్షాల మధ్య యుద్ధం అసెంబ్లీ బయట కూడా సాగింది. మీడియా పాయింట్ వేదికగా రెండుపార్టీల ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. వైసీపీ మహిళా ఎమ్మెల్యేలంతా కలిసి మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతుండగా… టీడీపీకి చెందిన కొందరు పురుష ఎమ్మెల్యేలు వచ్చారు. వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు ఉత్తరాంధ్ర సమస్యలు, రైల్వే జోన్‌పై మాట్లాడుతుండగా టీడీపీ ఎమ్మెల్యేలు గొడవకు దిగారు. వారు మాట్లాడేది మీడియాకు వినిపించకుండా నినాదాలు చేశారు. పది నిమిషాల్లో తామువెళ్లిపోతామని ఆ తర్వాత మాట్లాడుకోవాలని వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు కోరారు.

అయితే టీడీపీ ఎమ్మెల్యేలు అందుకు అంగీకరించలేదు. అబద్దాలు ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీ మహిళా ఎమ్మెల్యేలతో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న వైసీపీ పురుష ఎమ్మెల్యేలు కూడా అక్కడికి రావడంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఒకరినొకరు తోసుకున్నారు. వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు మాట్లాడుతుండగా కెమెరాలకు ఎదురుగా టీడీపీ మహిళా ఎమ్మెల్యేలు అనిత, యామిని బాల వచ్చి నిలబడ్డారు. దీనిపై వైసీపీ ఎమ్మెల్యేలు మరోసారి అభ్యంతరం తెలిపారు. ఇదెక్కడి న్యాయం అంటూ ప్రశ్నించారు. గిరిజన ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే అడ్డుగా నిలబడితే తామెక్కడికి వెళ్లాలని గిడ్డి ఈశ్వరి తదితరులు ప్రశ్నించారు. అసెంబ్లీలో ఎలాగో అవకాశం ఇవ్వరు… మీడియా పాయింట్‌ వద్ద కూడా మాట్లాడే అవకాశం ఇవ్వరా అని నిలదీశారు. అసెంబ్లీని ఎన్టీఆర్‌ ట్రస్ట్ భవన్‌లా మార్చారంటూ నినాదాలు చేశారు. అధికార పార్టీ వైఖరికి నిరసనగా నేలపై వైసీపీ ఎమ్మెల్యేలు బైఠాయించారు.

Click on Image to Read:

 

Tags:    
Advertisement

Similar News