అనుభవాలు చాలా నేర్పుతాయి..!
అగ్గిపుల్ల ..సబ్బుబిళ్ల..అరటి తొక్క..కుక్కపిల్ల కాదేది కవితకు అనర్హం అన్నాడు మహా కవి శ్రీశ్రీ. ఈ రోజుల్లో డైరెక్షన్ చాలా మంది చేయగలరు. అల్రేడి సక్సెస్ లో వున్న వారికి ఢోకా లేదు. అయితే హీరోలకు మాత్రం ప్రతి సినిమా ఒక పరీక్ష అనే చెప్పాలి. స్టార్ హీరో అయినప్పటికి.. ప్రస్తుతం వున్న మార్కెట్ పోటిలో నెగ్గుకు రావాలంటే ఫెయిల్ అయితే కష్టమే . అందుకే దర్శకులు కాదు..రేసు గుర్రాలు కావాలి. అటువంటి రేసు […]
Advertisement
అగ్గిపుల్ల ..సబ్బుబిళ్ల..అరటి తొక్క..కుక్కపిల్ల కాదేది కవితకు అనర్హం అన్నాడు మహా కవి శ్రీశ్రీ. ఈ రోజుల్లో డైరెక్షన్ చాలా మంది చేయగలరు. అల్రేడి సక్సెస్ లో వున్న వారికి ఢోకా లేదు. అయితే హీరోలకు మాత్రం ప్రతి సినిమా ఒక పరీక్ష అనే చెప్పాలి. స్టార్ హీరో అయినప్పటికి.. ప్రస్తుతం వున్న మార్కెట్ పోటిలో నెగ్గుకు రావాలంటే ఫెయిల్ అయితే కష్టమే .
అందుకే దర్శకులు కాదు..రేసు గుర్రాలు కావాలి. అటువంటి రేసు గుర్రల కోసమే యంగ్ టైగర్ వెయిట్ చేస్తున్నారు. వెతుకుతున్నారు. కొత్త పాత అని తేడ లేకుండా… ఎవరు కథలు చెప్పినా వింటున్నారట. గతంలో టెంపర్ చిత్రం తో మంచి హిట్ ఇచ్చిన పూరి జగన్నాద్..ఈ మధ్య ఎన్టీఆర్ కు ఒక కథ చెప్పారట. అయితే అది పూర్తి గా చెప్పలేదట. సగం అయ్యిందట. అయితే ఎన్టీఆర్ మాత్రం. పటాస్.. సుప్రీమ్ లాంటి హిట్స్ ఇచ్చిన యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చెప్పిన కథకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. జనతా గ్యారేజ్ ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ గా నిలిచే అవకాశం ఉందంటున్నారు ట్రేడ్ ఎక్స్ పర్ట్స్. ఎన్టీఆర్ యాక్టింగ్ పరంగా తన సత్తాను చాటుకునే అవకాశం ఇచ్చిన చిత్రం ఇది.
Advertisement