బొద్దింక‌లు తినిపించి.. కోరిక తీర్చుకునేవాడు

ప‌చ్చి మిర్చి ర‌సం తాగించ‌డం.. బొద్దింక‌లు, ఈగ‌లు, న‌ల్లుల‌ను తినిపించ‌డం, కొట్ట‌డం, చావ‌బాద‌డం.. ఎదురుతిరిగితే చంపేయ‌డం.. ఇలా న‌యీం వికృత చేష్ట‌లు విన‌డానికే విల్లేనంత హీనంగా ఉన్నాయి. అత‌ని చెర‌లో ఉన్న చిన్నారుల‌పై న‌యీం సాగించిన అకృత్యాల‌కు అడ్డే లేకుండా పోయింది. చిన్నారులన్న క‌నీస క‌నిక‌రం లేకుండా వారితో బ‌ల‌వంతంగా త‌న కామ‌వాంఛ‌లు తీర్చుకున్నాడు. వ‌ద్ద‌ని చెప్పినా.. ఎదురు తిరిగినా వినేవాడు కాడు. బొద్దింక‌లు, ఈగ‌లు, న‌ల్లులను తినిపించేవాడు. ఒంట్లో బాగాలేద‌న్నా ఊరుకునే వాడు కాదు. ప‌చ్చి […]

Advertisement
Update:2016-09-08 03:12 IST
ప‌చ్చి మిర్చి ర‌సం తాగించ‌డం.. బొద్దింక‌లు, ఈగ‌లు, న‌ల్లుల‌ను తినిపించ‌డం, కొట్ట‌డం, చావ‌బాద‌డం.. ఎదురుతిరిగితే చంపేయ‌డం.. ఇలా న‌యీం వికృత చేష్ట‌లు విన‌డానికే విల్లేనంత హీనంగా ఉన్నాయి. అత‌ని చెర‌లో ఉన్న చిన్నారుల‌పై న‌యీం సాగించిన అకృత్యాల‌కు అడ్డే లేకుండా పోయింది. చిన్నారులన్న క‌నీస క‌నిక‌రం లేకుండా వారితో బ‌ల‌వంతంగా త‌న కామ‌వాంఛ‌లు తీర్చుకున్నాడు. వ‌ద్ద‌ని చెప్పినా.. ఎదురు తిరిగినా వినేవాడు కాడు. బొద్దింక‌లు, ఈగ‌లు, న‌ల్లులను తినిపించేవాడు. ఒంట్లో బాగాలేద‌న్నా ఊరుకునే వాడు కాదు. ప‌చ్చి మిర్చి ర‌సం తాగించి ప‌శువులా మీద‌ప‌డేవాడు. రెండు రోజుల కోసారి త‌మ‌ను పువ్వుల్లా న‌లిపేసే వాడ‌ని న‌యీం చెర‌లో ఉన్న చిన్నారులు పోలీసుల‌కు వెల్ల‌డించారు. వారి మాట‌లు విన్న పోలీసులే క‌న్నీరు పెట్టుకున్నారంటే.. న‌యీం అకృత్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవ‌చ్చు.
న‌యీం త‌న అత్త సాయంతో ఇంట్లో ప‌నికోస‌మ‌ని, పెండ్లి చేస్తామ‌ని, చ‌దివిస్తామ‌ని ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాలు చెప్పి త‌మకు తెలిసిన‌వారి బంధువుల బాలిక‌ల‌ను, వివిధ ప్రాంతాల నుంచి తీసుకువచ్చేవాడు. తీరా త‌న డెన్‌కు వ‌చ్చాక వారిని త‌న కామ‌కోరిక‌లు తీర్చుకునేందుకు వాడుకున్నాడు. ఎదురు తిరిగిన న‌స్రీన్‌ను త‌మ క‌ళ్ల‌ముందే ఉరేసి చంపాడ‌ని గ‌తాన్ని గుర్తుచేసుకుని చిన్నారులు పోలీసుల ముందు విల‌పించారు. పీడ‌క‌ల‌లా వెంటాడుతున్న గ‌తాన్ని ఇంకా మ‌ర‌చిపోలేక‌పోతున్నారు. న‌యీం ఈ అకృత్యాల‌న్నింటినీ లేడీడాన్‌ ప‌ర్హానా, అఫ్సియా క‌ళ్లెదుటే పాల్ప‌డేవాడు. వాళ్లే స్వ‌యంగా ఆ చిన్నారుల‌ను న‌యీం గ‌దిలోకి పంపేవారు. న‌యీం ఇంట్లో మొత్తం 9 మంది కాగా వీరిలో ఏడాదిన్న‌ర పాప ఉంది. వీరిని బాలికల వ‌స‌తి గృహానికి పంపారు. వీరిలో న‌యీం బంధువులు కూడా ఉన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News