మహాయాగం తలపెట్టిన బాలయ్య

 బాలయ్యకు యాగాలు, యజ్ఞాలు, పూజలు అంటే చాలా నమ్మకం. సమయం దొరికిన ప్రతిసారి ఏదో ఒక యాగం చేస్తుంటాడు. ఇంట్లో ఉంటే ప్రతి రోజు ఉదయాన్నే పూజలు చేస్తాడు. ఈసారి కూడా బాలయ్య మరో మహా యాగాన్ని తలపెట్టాడు. అయితే ఈ యాగం సినిమాకు సంబంధించినది. నటసింహ నంద‌మూరి బాల‌కృష్ణ ప్రతిష్టాత్మక 100వ చిత్రం `గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి` ప్ర‌స్తుతం మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. నంద‌మూరి బాల‌కృష్ణ‌, హేమామాలిని, శ్రియపై కీల‌క స‌న్నివేశాల‌ు చిత్రీక‌రిస్తున్నారు. సెప్టెంబ‌ర్ 6న రాజ‌సూయ‌యాగం […]

Advertisement
Update:2016-09-08 03:11 IST

బాలయ్యకు యాగాలు, యజ్ఞాలు, పూజలు అంటే చాలా నమ్మకం. సమయం దొరికిన ప్రతిసారి ఏదో ఒక యాగం చేస్తుంటాడు. ఇంట్లో ఉంటే ప్రతి రోజు ఉదయాన్నే పూజలు చేస్తాడు. ఈసారి కూడా బాలయ్య మరో మహా యాగాన్ని తలపెట్టాడు. అయితే ఈ యాగం సినిమాకు సంబంధించినది. నటసింహ నంద‌మూరి బాల‌కృష్ణ ప్రతిష్టాత్మక 100వ చిత్రం 'గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి' ప్ర‌స్తుతం మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. నంద‌మూరి బాల‌కృష్ణ‌, హేమామాలిని, శ్రియపై కీల‌క స‌న్నివేశాల‌ు చిత్రీక‌రిస్తున్నారు.

సెప్టెంబ‌ర్ 6న రాజ‌సూయ‌యాగం చిత్రీక‌ర‌ణ‌ను ప్రారంభించారు. అఖండ భార‌తాన్ని ఏక‌తాటిపై తేవడానికి పురాణాలలో ధర్మరాజు, చారిత్రాత్మకంగా శాతవాహన చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి మాత్రమే ఈ యాగాన్ని నిర్వ‌హించారు. ఈ రాజ‌సూయ యాగ స‌మ‌యంలోనే శాత‌కర్ణి త‌న త‌ల్లి గౌత‌మి పేరును త‌న పేరు ముందు ఉంచుకుని త‌న పేరుని గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణిగా మార్చుకున్నారు. ఆ రోజునే కొత్త యుగానికి ఆది ఉగాది అని ప్ర‌కటించారు. అప్ప‌టి నుండి అదే రోజున ఉగాది పండుగ‌ను నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు.

అలాంటి కీలకమైన సన్నివేశాన్ని ఇప్పుడు బాలయ్యపై తెరకెక్కిస్తున్నారు. జాగ‌ర్ల‌మూడి క్రిష్‌ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుత షెడ్యూల్ సెప్టెంబ‌ర్ 20 వ‌ర‌కు మధ్య ప్రదేశ్ లో జరగనుంది. నటసింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో హేమామాలిని, శ్రేయ త‌దిత‌ర‌లు న‌టిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News