నాలిక కోస్తా..ప్ర‌తిప‌క్షాల‌కు త‌ల‌సాని వార్నింగ్‌!

మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ కు కోపం వ‌చ్చింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే.. ప్ర‌తిప‌క్ష నేత‌ల నాలిక కోస్తాన‌ని హెచ్చ‌రించారు. కొత్త జిల్లాల పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌పై ప్ర‌తిప‌క్షాలు సీఎంను టార్గెట్ చేసిన సంగ‌తి తెలిసిందే! ఈ క్ర‌మంలో కొంద‌రు కాంగ్రెస్ నాయ‌కులు సీఎం కేసీఆర్‌ను ఏక‌వ‌చ‌నంతో సంభోదించారు. మ‌రికొంద‌రు ఇంకాస్త ముందుకెళ్లి తిట్టినంత ప‌ని చేస్తున్నారు. దీనిపై మంత్రి త‌ల‌సాని స్పందించారు. సీఎం పై మాట్లాడేట‌ప్పుడు కాస్త ముందూవెన‌కా చూసి మాట్లాడాల‌ని సూచించారు. ఏక‌వ‌చ‌నం, పిచ్చిపిచ్చిగా మాట్లాడితే.. నాలిక […]

Advertisement
Update:2016-09-06 04:18 IST
మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ కు కోపం వ‌చ్చింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే.. ప్ర‌తిప‌క్ష నేత‌ల నాలిక కోస్తాన‌ని హెచ్చ‌రించారు. కొత్త జిల్లాల పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌పై ప్ర‌తిప‌క్షాలు సీఎంను టార్గెట్ చేసిన సంగ‌తి తెలిసిందే! ఈ క్ర‌మంలో కొంద‌రు కాంగ్రెస్ నాయ‌కులు సీఎం కేసీఆర్‌ను ఏక‌వ‌చ‌నంతో సంభోదించారు. మ‌రికొంద‌రు ఇంకాస్త ముందుకెళ్లి తిట్టినంత ప‌ని చేస్తున్నారు. దీనిపై మంత్రి త‌ల‌సాని స్పందించారు. సీఎం పై మాట్లాడేట‌ప్పుడు కాస్త ముందూవెన‌కా చూసి మాట్లాడాల‌ని సూచించారు. ఏక‌వ‌చ‌నం, పిచ్చిపిచ్చిగా మాట్లాడితే.. నాలిక కోస్తాన‌ని హెచ్చ‌రించారు. జిల్లాల ఏర్పాటులో శాస్ర్తీయ‌త లోపించంద‌ని గ‌గ్గోలు పెడుతున్న కాంగ్రెస్ నాయ‌కులు, కొత్త జిల్లాల‌పై ఇటీవ‌ల నిర్వ‌హించిన‌ అఖిల‌ప‌క్ష స‌మావేశంలో ఎందుకు నోరుమెద‌ప‌లేద‌ని సూటిగా ప్ర‌శ్నించారు. ఆ రోజు మౌనంగా ఉండి.. ఇప్పుడు జిల్లాల ఏర్పాటులో శాస్త్రీయ‌త లేద‌న‌డం సరికాద‌ని మండిప‌డ్డారు. మీకు కేవ‌లం జ‌నగామ‌, గ‌ద్వాల‌పైనే ఎందుకంత ఆస‌క్తి అని ప్ర‌శ్నించారు. జిల్లాల ఏర్పాటు ఏమీ ఇష్టానుసారంగా చేయ‌డం లేద‌న్నారు. అంతా ప‌ద్ధ‌తి ప్ర‌కారం.. ప్రజాస్వామ్య పద్ధ‌తిలో జరుగుతుంద‌న్నారు. డ్రాఫ్ట్ నోటిఫికేష‌న్ జారీ చేసి, నెల‌రోజుల స‌మ‌యం ఇచ్చి, ప్ర‌జ‌ల అభ్యంత‌రాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకునే జిల్లాల ఏర్పాటు సాగుతోంద‌న్నారు. దీనిపై అన‌వ‌స‌ర రాద్దాంతం స‌రికాద‌ని హిత‌వు ప‌లికారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News