తమ్ముళ్లు హర్ట్ అయ్యారు... వైసీపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు

ఓటుకు నోటు కేసులో ఏసీబీ కోర్టు విచారణకు ఆదేశించడం చంద్రబాబుకు బాగానే ఆగ్రహం తెప్పించినట్టు ఉంది. ఏసీబీ కోర్టును ఆశ్రయించిన వైసీపీపై ఎదురుదాడి మొదలుపెట్టారు. ఇప్పటికే తన చేతిలో ఉన్న పోలీస్‌ శాఖ సాయంలో భూమన కరుణాకర్‌రెడ్డి, సాక్షి పత్రికకు నోటీసులు జారీ చేశారు. తుని కేసులో భూమనను, అమరావతి అక్రమాలపై కథనాలు రాసినందుకు సాక్షి వారిని విచారణకు రావాల్సిందిగా పోలీసులు ఆదేశించారు. తాజాగా చంద్రబాబుకు వ్యతిరేకంగా ఏసీబీ కోర్టును ఆశ్రయించిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కేపై టీడీపీ […]

Advertisement
Update:2016-09-04 01:22 IST

ఓటుకు నోటు కేసులో ఏసీబీ కోర్టు విచారణకు ఆదేశించడం చంద్రబాబుకు బాగానే ఆగ్రహం తెప్పించినట్టు ఉంది. ఏసీబీ కోర్టును ఆశ్రయించిన వైసీపీపై ఎదురుదాడి మొదలుపెట్టారు. ఇప్పటికే తన చేతిలో ఉన్న పోలీస్‌ శాఖ సాయంలో భూమన కరుణాకర్‌రెడ్డి, సాక్షి పత్రికకు నోటీసులు జారీ చేశారు. తుని కేసులో భూమనను, అమరావతి అక్రమాలపై కథనాలు రాసినందుకు సాక్షి వారిని విచారణకు రావాల్సిందిగా పోలీసులు ఆదేశించారు.

తాజాగా చంద్రబాబుకు వ్యతిరేకంగా ఏసీబీ కోర్టును ఆశ్రయించిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కేపై టీడీపీ లాయర్లు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరారు. గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో రామకృష్ణారెడ్డికి ఆస్తులు ఉన్నాయని వాటిని ఎన్నికల అఫిడవిట్‌లో చూపించలేదని ఆరోపించారు.కాబట్టి అవన్నీ అక్రమాస్తులేనని వాస్తవాలు దాచిన ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయాలని కోరారు. ఆర్కే ఆస్తులపై విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అదనపు ఎన్నికల ప్రధానాధికారిని కలిసి టీడీపీ లాయర్లు ఫిర్యాదు చేశారు.

వైసీపీ నేతలపై ఇంకా ఏమైనా పాత కేసులు ఉంటే వాటిని బయటకు తీయాలని చంద్రబాబు ఆదేశించినట్టు తెలుస్తోంది. అదే జరిగితే చంద్రబాబులాగా వైసీపీ నేతలపై విచారణ విషయంలో స్టేలు వస్తాయో రావో!. చూస్తుంటే ఏసీబీ కోర్టు తనపైనే విచారణకు ఆదేశిస్తుందా అన్నట్టుగా చంద్రబాబు ధోరణి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధానులను, రాష్ట్రపతులను నియమించానని చెప్పుకునే చంద్రబాబుకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు కోర్టుకు వెళ్లడం అటు తెలుగు తమ్ముళ్లను కూడా బాగా హర్ట్ చేసినట్టు ఉంది.

Click on Image to Read:

 

 

 

Tags:    
Advertisement

Similar News