ఆ విషయంలో అనుష్క మనసు లాగదు..!
ఎవరైనా సరే కొన్నాళ్లపాటు ఒక వాతావరణంలో గడిపాక ఉన్నట్టుండి వేరొక కొత్త ప్రదేశానికి వెళితే అంత తొందరగా ఇమిడిపోలేరు. తిరిగి వెళ్లిపోదామా అని మనసు లాగుతుంటుంది. అనుష్క పదేళ్లుగా చిత్ర పరిశ్రమలో ఉంది. అగ్ర తారగా హంగు, ఆర్భాటాల నడమ గడుపుతుంది. కానీ , ఆమే తన చుట్టూ ఇలాంటి సందడేది లేక పోయినా సౌకర్యంగానే ఉంటానంటోంది. సినిమాల్లోకి రాక ముందు తనది ఒక చిన్న ప్రపంచం. తన వ్యాపకాలు పరిమితం. కానీ సినిమాల్లొకి వచ్చాక ఆ […]
Advertisement
ఎవరైనా సరే కొన్నాళ్లపాటు ఒక వాతావరణంలో గడిపాక ఉన్నట్టుండి వేరొక కొత్త ప్రదేశానికి వెళితే అంత తొందరగా ఇమిడిపోలేరు. తిరిగి వెళ్లిపోదామా అని మనసు లాగుతుంటుంది. అనుష్క పదేళ్లుగా చిత్ర పరిశ్రమలో ఉంది. అగ్ర తారగా హంగు, ఆర్భాటాల నడమ గడుపుతుంది. కానీ , ఆమే తన చుట్టూ ఇలాంటి సందడేది లేక పోయినా సౌకర్యంగానే ఉంటానంటోంది. సినిమాల్లోకి రాక ముందు తనది ఒక చిన్న ప్రపంచం. తన వ్యాపకాలు పరిమితం. కానీ సినిమాల్లొకి వచ్చాక ఆ ప్రపంచం వందల రెట్టు పెరిగి పెద్దదయ్యిందట. సినిమాల పరంగా ఎంతో ప్రపంచాని చూసినప్పటికి..ఇంటికి వెళితే మాత్రం తనదైన చిన్న ప్రపంచంలో గడుపడానికి ఇష్టపడుతుందట.
కెరీర్ బిగినింగ్ లో సినిమా వాతావరణానికి అలవాటు పడటానికి కొంత కాలం పట్టిందట. స్లో గా తను ఎక్కడికి వెళితే అక్కడే ఇంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటుందట. చుట్టూ వున్న వాళ్లందరు తనకు సొంత మనుషులు అనే ఫీలింగ్ వస్తుందట. మనసుంటే మనం ఎక్కడికి వెళ్లినా మనదైన ప్రపంచాని సృష్టించుకోవచ్చు అంటోంది. నటిగా ప్రస్తుతం బాహుబలి ది కన్ క్లూజాన్ .. భాగమతీ చిత్రాలు చేస్తుంది.
Advertisement