బర్త్ డే సెలబ్రేషన్ అంటే పవన్ ఎందుకు ఇష్టపడడు?
పవన్ కళ్యాణ్ కు ఉన్న అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అన్నయ్య మెగాస్టార్ వేసిన ప్లాట్ మీద నుంచి ఎంట్రీ ఇచ్చినప్పటికి అనతి కాలంలోనే తనకంటూ ఒక స్పెషల్ ఫాలోయింగ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఆయన చేసిన చిత్రాలకు ..ఆయన రియల్ లైఫ్ కు ..ఆయన మాట్లాడే మాటలకు యూత్ బాగా పాలో అవుతున్నారు. రాజకీయంగా కూడా పవన్ కళ్యాణ్ మాట కు ప్రాధాన్యత రావడానికి అభిమానులు ఆయన మాటలకు […]
Advertisement
పవన్ కళ్యాణ్ కు ఉన్న అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అన్నయ్య మెగాస్టార్ వేసిన ప్లాట్ మీద నుంచి ఎంట్రీ ఇచ్చినప్పటికి అనతి కాలంలోనే తనకంటూ ఒక స్పెషల్ ఫాలోయింగ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఆయన చేసిన చిత్రాలకు ..ఆయన రియల్ లైఫ్ కు ..ఆయన మాట్లాడే మాటలకు యూత్ బాగా పాలో అవుతున్నారు. రాజకీయంగా కూడా పవన్ కళ్యాణ్ మాట కు ప్రాధాన్యత రావడానికి అభిమానులు ఆయన మాటలకు విలువనిస్తుండటమే.
కెరీర్ పరంగా తొలిప్రేమ, ఖుషి చిత్రాలు పవన్ కళ్యాణ్ కు ఎదురు లేకుండా చేశాయి. ఆ తరువాత చాల కాలం హిట్ లేదు. లేక పొయినా ఫ్యాన్స్ మాత్రం పవన్ కళ్యాణ్ ను అట్టిపెట్టుకునే వున్నారు. ఆయన ఫాలోయింగ్ లో ఏ మాత్రం తేడా రాలేదు. హరీష్ శంకర్ ఇచ్చిన గబ్బర్ సింగ్ చిత్రం తో పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ దగ్గర తన సత్తాను చాటుకున్నాడు. అంతే కాదు. ఇక త్రివిక్రమ్ తో చేసిన అత్తారింటికి దారేది చిత్రంతో ఒక స్టార్ హీరో ఇమేజ్ స్టామినా ఎలా వుంటుందో చాటింది. దాదాపు 90 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సరి కొత్త రికార్టులను నెలకొల్పింది. ఆ తరువాత పవన్ కళ్యాణ్ చేసిన సర్థార్ గబ్బర్ సింగ్ డిజాస్టర్ అనిపించుకున్నప్పటికి దాదాపు 50 కోట్లు కలెక్ట్ చేసిందనే టాక్ ఉంది. పవన్ స్వయంగా డైరెక్ట్ చేసి నటించిన చిత్రం జానీ. అలాగే వైవాహిక జీవితంలో ఇప్పటికి మూడో పెళ్లి చేసుకున్నాడు. బ్రది లో తన సహనటి రేణుదేశాయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ తరువాత ఆమేతో కూడా విడాకులు తీసుకున్నాడు. ప్రస్తుతం ఒక రష్యన్ యువతిని పెళ్లి చేసుకున్నాడు. జనసేన పార్టీ స్థాపించి పొలిటికల్ గా సమాజసేవ చేయడానికి సమాయత్తం అవుతున్నాడు.
చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ కు బర్ద్ డే లు జరుపుకోవడం అసలు ఇష్టం ఉండదట. అందుకే ఈ విషయంలో సింపుల్ గా ఉండటానికే ఇప్పటికీ ఇష్టపడతాడు. ఇది తన అభిమానులు కూడా అర్ధం చేసుకోవడం కూడా సంతోషం అన్నారు. ఇక సర్థార్ గబ్బర్ సింగ్ తరువాత పవన్
కళ్యాణ్ చేసే సినిమాకు ఆ మధ్య “కడప కింగ్” అనే టైటిల్ వినిపించింది. పవన్ బర్త్ డే సందర్భంగా ఆ సినిమాకు “కాటమరాయుడు” అనే టైటిల్ అనుకుంటున్నాడని తెలుస్తుంది. ఇదే టైటిల్ తో అత్తారింటికి దారేది చిత్రంలో పవన్ ఒక పాట పాడిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా పవన్ మరింత కాలం నటుడిగా అభిమానుల్ని అలరించాలని కోరుకుంటూ తెలుగు గ్లోబల్ .కమ్ తరుపున బర్త్ డే శుభాకాంక్షలు తెలియ చేస్తున్నాం.
Advertisement