రూ.11వేల కోట్లు.. రిలయన్స్‌ దొంగే

కృష్ణా-గోదావరి బేసిన్‌లో రిలయన్స్ చేస్తున్న విన్యాసాలు మరోసారి బట్టబయలయ్యాయి.కేజీ బేసిన్‌లోని ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్‌జీసీకి చెందిన క్షేత్రాల నుంచి గ్యాస్‌ను రిలయన్స్ దొంగలించింది నిజమేనని నిర్దారణ అయింది. ఈ వ్యవహారంపై ఏర్పాటైన జస్టిస్ అజిత్ ప్రకాశ్‌ షా కమిటీ దీన్ని నిర్ధారించింది. అక్రమ మార్గంలో ఓఎన్‌జీసీకి చెందిన రూ 11వేల కోట్ల విలువైన గ్యాస్‌ను రిలయన్స్ లాగేసినట్టు నిర్దారించింది. ఈ తప్పుడు పని చేసినందుకు గాను ఓఎన్‌జీసీకి పరిహారం చెల్లించేలా చూడాలని… భవిష్యత్తులో ఇలాంటి పనులు […]

Advertisement
Update:2016-09-02 05:20 IST

కృష్ణా-గోదావరి బేసిన్‌లో రిలయన్స్ చేస్తున్న విన్యాసాలు మరోసారి బట్టబయలయ్యాయి.కేజీ బేసిన్‌లోని ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్‌జీసీకి చెందిన క్షేత్రాల నుంచి గ్యాస్‌ను రిలయన్స్ దొంగలించింది నిజమేనని నిర్దారణ అయింది. ఈ వ్యవహారంపై ఏర్పాటైన జస్టిస్ అజిత్ ప్రకాశ్‌ షా కమిటీ దీన్ని నిర్ధారించింది. అక్రమ మార్గంలో ఓఎన్‌జీసీకి చెందిన రూ 11వేల కోట్ల విలువైన గ్యాస్‌ను రిలయన్స్ లాగేసినట్టు నిర్దారించింది. ఈ తప్పుడు పని చేసినందుకు గాను ఓఎన్‌జీసీకి పరిహారం చెల్లించేలా చూడాలని… భవిష్యత్తులో ఇలాంటి పనులు మరోసారి చేయకుండా చర్యలు తీసుకోవాలని కమిటీ సిపార్సు చేసింది.

2009 ఏప్రిల్‌ నుంచి 2015 మార్చి మధ్య కాలంలో ఓఎన్‌జీసీకి చెందిన గోదావరి-పీఎంఎల్‌, కేజీ-డీడబ్ల్యూఎన్‌ 98/2 బ్లాక్స్‌లో 11.122 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల ఓఎన్‌జీసీ గ్యాస్‌ను పక్కనే రిలయన్స్‌కు చెందిన కేజీ-డీ6 బ్లాక్‌ల ద్వారా తోడేసుకున్నట్లు తేల్చారు. రిలయన్స్ దొంగతనం కారణంగా ఓఎన్‌జీసీ క్షేత్రాల్లో గ్యాస్‌ నిక్షేపాలు మాయమయ్యాయి. అయితే రిలయన్స్‌కు చెందిన క్షేత్రాల్లో మాత్రం ఇప్పటికీ గ్యాస్ ఉత్పత్తి జరుగుతూనే ఉంది. నివేదికను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత వివరాలు బహిర్గతం చేస్తామని మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ చెప్పారు. అయితే దొంగతనం చేసింది రిలయన్స్ కాబట్టి పూర్తి వివరాలు బయటకువస్తాయో లేదో చూడాలి.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News