మహిళల కోసం ముందుకొచ్చిన సూపర్ స్టార్

సూపర్ స్టార్ రజనీకాంత్ ఎట్టకేలకు మీడియా ముందుకొచ్చారు. కబాలి విడుదల తర్వాత మళ్లీ కనిపించని రజనీకాంత్… ఐక్యరాజ్యసమితి ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలపై అకృత్యాలను ఆపాలంటూ పిలుపునిచ్చారు. తన కూతురు, హీరో ధనుష్ భార్య ఐశ్వర్య రజనీకాంత్… ఇండియాలో మహిళల కోసం గుడ్ విల్ ఎంబాసిడర్ గా ఎంపికైన సందర్భంగా రజనీకాంత్ ఆనందం వ్యక్తంచేశారు. లింగసమానత్వం కోసం ఐశ్వర్య కొన్నేళ్లుగా పోరాటం సాగిస్తోందని, ఇన్నాళ్లకు ఐక్యరాజ్యసమితి ద్వారా ఆమెకు ఓ గుర్తింపు లభించిందని రజనీకాంత్ అన్నారు. […]

Advertisement
Update:2016-09-01 03:03 IST

సూపర్ స్టార్ రజనీకాంత్ ఎట్టకేలకు మీడియా ముందుకొచ్చారు. కబాలి విడుదల తర్వాత మళ్లీ కనిపించని రజనీకాంత్… ఐక్యరాజ్యసమితి ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలపై అకృత్యాలను ఆపాలంటూ పిలుపునిచ్చారు. తన కూతురు, హీరో ధనుష్ భార్య ఐశ్వర్య రజనీకాంత్… ఇండియాలో మహిళల కోసం గుడ్ విల్ ఎంబాసిడర్ గా ఎంపికైన సందర్భంగా రజనీకాంత్ ఆనందం వ్యక్తంచేశారు. లింగసమానత్వం కోసం ఐశ్వర్య కొన్నేళ్లుగా పోరాటం సాగిస్తోందని, ఇన్నాళ్లకు ఐక్యరాజ్యసమితి ద్వారా ఆమెకు ఓ గుర్తింపు లభించిందని రజనీకాంత్ అన్నారు. సమాజంలో మహిళలకు మంచి గౌరవం దక్కేలా, వాళ్లకు ఉత్తమమైన స్థానాన్ని కల్పించేలా, ఐక్యరాజ్యసమితి సహకారంతో… ఐశ్వర్య కృషి చేస్తుందని సూపర్ స్టార్ అన్నారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో రజనీకాంత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమంలో మాట్లాడిన రజనీకాంత్ పూర్తిగా మహిళల హక్కులు, ఐక్యరాజ్యసమితి గురించే మాట్లాడారు. తన కొత్త సినిమా విశేషాల్ని ఎక్కడా ప్రస్తావించలేదు. మరీ ముఖ్యంగా ధనుష్ నిర్మాతగా, తను హీరోగా చేయబోయే సినిమా గురించి అస్సలు ప్రస్తావించలేదు.

Click to Read

జనతా గ్యారేజ్ కు వర్షం దెబ్బ

Tags:    
Advertisement

Similar News