వ్యవస్థ నుంచి ఏక వ్యక్తి పార్టీలోకి వచ్చా- దేవినేని నెహ్రు

విజయవాడకు చెందిన దేవినేని నెహ్రు కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. టీడీపీలో చేరారు. చంద్రబాబును కలిశారు. మంచి వాతావరణంలో చంద్రబాబు తనను పార్టీలోకి ఆహ్వానించారని నెహ్రు చెప్పారు. ఇది ఒక శుభపరిణామం అన్నారు. పుట్టింటికి వచ్చినట్టుగా ఉందన్నారు. కాంగ్రెస్‌లో ఉన్నా తనకు అది అద్దె ఇల్లులా అప్పుడప్పుడు అనిపించేదన్నారు. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిలో ఉడతా భక్తిగా సాయం చేయాలనే టీడీపీలో చేరుతున్నట్టు వెల్లడించారు. ఇకపై అమరావతి అభివృద్దిలో తమ వంతు పాత్ర ఉంటుందన్నారు. తనకు రాజకీయ జన్మనిచ్చింది టీడీపీయేనన్నారు. […]

Advertisement
Update:2016-08-30 08:26 IST

విజయవాడకు చెందిన దేవినేని నెహ్రు కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. టీడీపీలో చేరారు. చంద్రబాబును కలిశారు. మంచి వాతావరణంలో చంద్రబాబు తనను పార్టీలోకి ఆహ్వానించారని నెహ్రు చెప్పారు. ఇది ఒక శుభపరిణామం అన్నారు. పుట్టింటికి వచ్చినట్టుగా ఉందన్నారు. కాంగ్రెస్‌లో ఉన్నా తనకు అది అద్దె ఇల్లులా అప్పుడప్పుడు అనిపించేదన్నారు. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిలో ఉడతా భక్తిగా సాయం చేయాలనే టీడీపీలో చేరుతున్నట్టు వెల్లడించారు. ఇకపై అమరావతి అభివృద్దిలో తమ వంతు పాత్ర ఉంటుందన్నారు. తనకు రాజకీయ జన్మనిచ్చింది టీడీపీయేనన్నారు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో టీడీపీని వీడి కాంగ్రెస్‌లోకి వెళ్లాల్సి వచ్చిందన్నారు.

కాంగ్రెస్ లో చేరినప్పుడు చాలా బాధపడ్డానన్నారు. వ్యవస్థ నుంచి ఏక వ్యక్తి పార్టీలోకి వస్తున్నానన్నారు. తనకుమారుడు అవినాష్ మాత్రం కాంగ్రెస్‌ వ్యవస్థ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారని తనతో పాటు ఏక వ్యక్తి పార్టీలోకి వస్తున్నాడని, ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడుతారని నెహ్రు చెప్పారు. మరో జెండా ఎత్తడం ఇష్టం లేకనే ఇతర పార్టీల్లోకి వెళ్లకుండా టీడీపీలో చేరుతున్నామని చెప్పారు. వచ్చే నెల 15న అధికారికంగా అనుచరులతో కలిసి టీడీపీలో చేరుతానన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News