జగన్‌ను తీసుకుంటామనడం అతడి అజ్ఞానానికి నిదర్శనం

పవన్ కల్యాణ్‌ చేతనైతే ఫుల్ టైమ్ రాజకీయాలు చేయాలని లేకపోతే రజనీకాంత్‌లా ఇంట్లో కూర్చోవాలని సీపీఐ నాయకుడు నారాయణ సూచించారు. ఏపీలో మూడో ప్రత్యామ్నాయ శక్తికి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. పవన్ సరిగా ముందుకెళ్తే ఖచ్చితంగా శక్తిగా ఎదిగే అవకాశాలుంటాయన్నారు. అవసరం అనుకుంటే పవన్‌తో చర్చలకు తాము సిద్దమని చెప్పారు. చంద్రబాబు కుమారుడు లోకేష్ ఒక రాజకీయ అజ్ఞాని అని ఎద్దేవా చేశారు. కావాలంటే జగన్‌ను కూడా టీడీపీలోకి తీసుకుంటామని చెప్పడం బట్టే లోకేష్  అవివేకం బయటపడుతోందన్నారు. […]

Advertisement
Update:2016-08-30 09:05 IST

పవన్ కల్యాణ్‌ చేతనైతే ఫుల్ టైమ్ రాజకీయాలు చేయాలని లేకపోతే రజనీకాంత్‌లా ఇంట్లో కూర్చోవాలని సీపీఐ నాయకుడు నారాయణ సూచించారు. ఏపీలో మూడో ప్రత్యామ్నాయ శక్తికి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. పవన్ సరిగా ముందుకెళ్తే ఖచ్చితంగా శక్తిగా ఎదిగే అవకాశాలుంటాయన్నారు. అవసరం అనుకుంటే పవన్‌తో చర్చలకు తాము సిద్దమని చెప్పారు. చంద్రబాబు కుమారుడు లోకేష్ ఒక రాజకీయ అజ్ఞాని అని ఎద్దేవా చేశారు. కావాలంటే జగన్‌ను కూడా టీడీపీలోకి తీసుకుంటామని చెప్పడం బట్టే లోకేష్ అవివేకం బయటపడుతోందన్నారు. ఏపీలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. 2019 ఎన్నికల్లో సీపీఐ ప్రధాన ఎజెండాగా ప్రత్యేక హోదా అంశం ఉంటుందన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News