నాగార్జున పుట్టినరోజుకు పోస్టల్ స్టాంప్
ఈసారి నాగార్జున పుట్టినరోజు చాలా విలక్షణంగా, గ్రాండ్ గా జరగబోతోంది. ఎఁదుకంటే ఈ వయసులో కూడా మన్మధుడు దూసుకుపోతున్నాడు. వరుసగా హిట్స్ అందుకుంటున్నాడు. ఈమధ్యకాలంలో ఫుల్ స్వింగ్ లో ఉన్న హీరోగా నాగార్జున పేరు మారుమోగిపోతోంది. సోగ్గాడే చిన్ని నాయనా హిట్ తో పాటు.. ఊపిరితో కూడా సక్సెస్ అందుకున్న నాగ్.. ఈసారి మరో భక్తిరస చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అందుకే నాగార్జునకు ఇది వెరీవెరీ స్పెషల్ బర్త్ డే. ఈ వెరీ స్పెషల్ బర్త్ […]
ఈసారి నాగార్జున పుట్టినరోజు చాలా విలక్షణంగా, గ్రాండ్ గా జరగబోతోంది. ఎఁదుకంటే ఈ వయసులో కూడా మన్మధుడు దూసుకుపోతున్నాడు. వరుసగా హిట్స్ అందుకుంటున్నాడు. ఈమధ్యకాలంలో ఫుల్ స్వింగ్ లో ఉన్న హీరోగా నాగార్జున పేరు మారుమోగిపోతోంది. సోగ్గాడే చిన్ని నాయనా హిట్ తో పాటు.. ఊపిరితో కూడా సక్సెస్ అందుకున్న నాగ్.. ఈసారి మరో భక్తిరస చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అందుకే నాగార్జునకు ఇది వెరీవెరీ స్పెషల్ బర్త్ డే. ఈ వెరీ స్పెషల్ బర్త్ డే ఇప్పుడు మరింత స్పెషల్ కాబోతోంది. అవును… నాగార్జునపై ఏకంగా ఓ పోస్టల్ స్టాంప్ విడుదలకానుంది. ఈరోజు నాగార్జున పుట్టినరోజు సందర్భంగా… అతడి తనయులు నాగచైతన్య, అఖిల్ కలిసి ఓ పోస్టల్ స్టాంప్ ను విడుదల చేస్తున్నారు. అతి తక్కువ సంఖ్యలో ముద్రించిన ఈ పోస్టల్ స్టాంప్ ను కొంతమంది సన్నిహితులు, ముఖ్యులకు మాత్రమే అందించనున్నారు. ఓ హీరోపై పోస్టల్ స్టాంప్ రావడం అరుదైన విషయమే. గతంలో కృష్ణ, చిరంజీవి, ఏఎన్నార్ లాంటి హీరోలపై మాత్రమే పోస్టల్ స్టాంపులు వచ్చాయి. మళ్లీ ఇప్పుడు నాగార్జునకే ఆ అరుదైన గౌరవం దక్కింది. అన్నట్టు ఈ పుట్టినరోజు నాడు… తన కొత్త సినిమాకు సంబంధించిన మరింత స్టఫ్ తో పాటు.. తను నిర్మాతగా తెరకెక్కిస్తున్న నిర్మలా కాన్వెంట్ విశేషాల్ని కూడా నాగార్జున వెల్లడించబోతున్నాడు.