దిల్ రాజ్ గురించి ఇవి నిజాలా..?
శర్వానంద్ హీరోగా సతీష్ వేగ్నేశ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెం.24 కొత్త చిత్రం ‘శతమానంభవతి’. ఈ సినిమా శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని దిల్‌రాజు కార్యాలయంలో ప్రారంభమైంది. అయితే ఈ సినిమాను దిల్ రాజ్ అప్పు చేసి చేస్తున్నాడనే రూమర్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. తెలుగులో నష్టాలు లేకుండా నిర్మాతగా నిలదొక్కుకున్నాడనే పేరు దిల్ రాజుకు ఉండేది. అయితే ఈ మద్య కాలంలో కొన్ని సినిమాల ఫలితాలు దిల్ రాజును ఆర్థికంగా దెబ్బతీసాయని, […]
Advertisement
శర్వానంద్ హీరోగా సతీష్ వేగ్నేశ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెం.24 కొత్త చిత్రం ‘శతమానంభవతి’. ఈ సినిమా శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని దిల్‌రాజు కార్యాలయంలో ప్రారంభమైంది. అయితే ఈ సినిమాను దిల్ రాజ్ అప్పు చేసి చేస్తున్నాడనే రూమర్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. తెలుగులో నష్టాలు లేకుండా నిర్మాతగా నిలదొక్కుకున్నాడనే పేరు దిల్ రాజుకు ఉండేది.
అయితే ఈ మద్య కాలంలో కొన్ని సినిమాల ఫలితాలు దిల్ రాజును ఆర్థికంగా దెబ్బతీసాయని, దీంతో ఫైనాన్షియర్ల వద్ద అప్పు చేసి సినిమా తీస్తున్నాడని టాక్. శతమానం భవతి సినిమా ముహుర్తపు సన్నివేశానికి ప్రముఖ ఫైనాన్సియర్ సత్యరంగయ్య క్లాప్ కొట్టగా, సత్య రంగయ్య మనవడు రంగ యశ్వంత్ కెమెరా స్విచ్చాన్ చేశారు. సత్య రంగయ్య తనయుడు ప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించారు…. వీరు ఈ సినిమాకు ఫైనాన్స్ చేస్తున్నారని టాక్.
Advertisement