అడవి...జోరునవాన... భార్య శవం, పసిగుడ్డుతోపాటు అతడిని బస్ దింపేశారు!
మనిషి పట్ల మనిషి నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తున్న సంఘటనలు ఈ మధ్యకాలంలో ఒకదాని తరువాత ఒకటి వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. మధ్య ప్రదేశ్‌లోని దామో జిల్లాలో శనివారం అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఛాతర్పూర్ జిల్లాకు చెందిన రామ్‌సింగ్ తన భార్య మల్లిభాయికి ఆరోగ్యం బాగాలేకపోవటంతో ఆమెని దామో జిల్లాలోని ఆసుపత్రికి తీసుకువెళుతున్నాడు. ఐదు రోజుల క్రితమే మల్లిబాయి ఒక బిడ్డకు జన్మనివ్వగా… ఆమె తీవ్రమైన అనారోగ్యానికి గురయింది. అయితే దురదృష్టవశాత్తూ ఆసుపత్రికి చేరకుండానే మార్గమధ్యంలో బస్సులో మల్లిబాయి […]
మనిషి పట్ల మనిషి నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తున్న సంఘటనలు ఈ మధ్యకాలంలో ఒకదాని తరువాత ఒకటి వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. మధ్య ప్రదేశ్‌లోని దామో జిల్లాలో శనివారం అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఛాతర్పూర్ జిల్లాకు చెందిన రామ్‌సింగ్ తన భార్య మల్లిభాయికి ఆరోగ్యం బాగాలేకపోవటంతో ఆమెని దామో జిల్లాలోని ఆసుపత్రికి తీసుకువెళుతున్నాడు. ఐదు రోజుల క్రితమే మల్లిబాయి ఒక బిడ్డకు జన్మనివ్వగా… ఆమె తీవ్రమైన అనారోగ్యానికి గురయింది. అయితే దురదృష్టవశాత్తూ ఆసుపత్రికి చేరకుండానే మార్గమధ్యంలో బస్సులో మల్లిబాయి మరణించింది.
అంతే…బస్ కండక్టర్ శారదా సేన్ నిర్దాక్షిణ్యంగా రామ్సింగ్ని అతని భార్య శవంతో పాటు కిందికి దిగిపోమని బలవంతపెట్టాడు. రామ్సింగ్ ఎంతగా బ్రతిమలాడినా వినకుండా జోరున కురుస్తున్న వానలోనే వారిని అడవిలో దించేసి వెళ్లిపోయాడు. రామ్ సింగ్ ఐదురోజుల పసిబిడ్డ, వృద్ధురాలైన తల్లి, మరణించిన భార్య శవంతో అమోమయంతో అలా అడవిలో నిలబడిపోయాడు.
కాసేపటికి అటుగా వెళుతున్న ఇద్దరు న్యాయవాదులు మృత్యుంజయ్ హజారీ, రాజేష్ పటేల్ రామ్… సింగ్ పరిస్థితి చూసి పోలీసులకు కాల్ చేశారు. అయితే పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి…ఏం జరిగిందో తెలుసుకుని వివరాలు రాసుకుని వెళ్లిపోయారని న్యాయవాదులు చెబుతున్నారు. ఆ తరువాత న్యాయవాదులే అతనికి అంబులెన్స్ని సమకూర్చినట్టుగా తెలుస్తోంది. ఇలా ఎందుకు చేశావని కండక్టర్ని అడిగితే బస్‌లోని ఇతర ప్రయాణీకులకు అసౌకర్యం కలిగించకూడదనే అలా చేశానన్నాడు.
Click on Image to Read: