టీడీపీ నేతలే అప్రమత్తం కావాలి... ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది...
రాజధాని నిర్మాణంలో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్రంగా తప్పుపట్టారు. అమరావతిలో జరుగుతున్న అవకతవకలపై ఒక బుక్‌లెట్ ను విడుదల చేశారు. ఈ బుక్ లెట్ చదివితే అమరావతి భ్రమరావతిగా ఎలా మారిందో అర్థమవుతుందన్నారు. అమరావతి భ్రమరావతే కాకుండా యమరావతిగా కూడా మారే సూచనలు కనిపిస్తున్నాయన్నారు. హైటెక్ సిటీ ప్రాంతంలో భూముల ధరలు పెరిగినట్టుగా అమరావతిలోనూ ధరలు పెరుగుతాని చంద్రబాబు నమ్మించారని.. అందుకే రైతులు భూములు ఇచ్చారని ఉండవల్లి చెప్పారు. కానీ […]
Advertisement
రాజధాని నిర్మాణంలో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్రంగా తప్పుపట్టారు. అమరావతిలో జరుగుతున్న అవకతవకలపై ఒక బుక్‌లెట్ ను విడుదల చేశారు. ఈ బుక్ లెట్ చదివితే అమరావతి భ్రమరావతిగా ఎలా మారిందో అర్థమవుతుందన్నారు. అమరావతి భ్రమరావతే కాకుండా యమరావతిగా కూడా మారే సూచనలు కనిపిస్తున్నాయన్నారు. హైటెక్ సిటీ ప్రాంతంలో భూముల ధరలు పెరిగినట్టుగా అమరావతిలోనూ ధరలు పెరుగుతాని చంద్రబాబు నమ్మించారని.. అందుకే రైతులు భూములు ఇచ్చారని ఉండవల్లి చెప్పారు. కానీ చంద్రబాబు చెబుతున్నట్టు అమరావతిలో భూముల ధరలు పెరగాలంటే మరో 150 ఏళ్లు పడుతుందన్నారు. ఈ పరిస్థితుల్లో భూములిచ్చిన వారు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా వస్తుందేమోనని ఉండవల్లి ఆందోళన వ్యక్తం చేశారు.
చంద్రబాబు పనితీరులోనూ తేడా కనిపిస్తోందన్నారు. ఒక గదిలో స్క్రీన్లు పెట్టుకుని ఏ ఆస్పత్రిలో ఏ రోగికి ఏ ఇంజెక్షన్ వేశారు. ఏ లిప్ట్‌లో ఎంతమంది ఎక్కారు?. పుష్కరాల్లో ఏ ఘాట్ దగ్గర ఎంత మంది స్నానం చేశారు. పించన్ ఎవరు ఎప్పుడు ఎన్ని గంటలకు తీసుకున్నారు ఇలా అన్ని తనకు తెలిసిపోతున్నాయని చంద్రబాబు చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇలాంటి చిన్నచిన్న పనులు చూడడానికి ముఖ్యమంత్రి ఉన్నదా? అని ప్రశ్నించారు. పుష్కరాల్లో భక్తులను బస్సులు ఎక్కించడం, పుష్కర ఘాట్ల వద్ద ప్రసంగాలు ఇవ్వడం ఇవన్నీ ముఖ్యమంత్రి చేసే పనులు కాదన్నారు. సీఎం చేసే పనులు వేరే ఉంటాయన్నారు. చంద్రబాబు తీరులో ఏదో తేడా కనిపిస్తోందని టీడీపీ నేతలే దీనిపై అప్రమత్తం కావాలని ఉండవల్లి కోరారు. లేకుంటే పైకి తెచ్చిన చంద్రబాబే పార్టీ నేతలను అఘాతంలోకి నెట్టేస్తారని హెచ్చరించారు. హైదరాబాద్‌లో 60ఏళ్లలో ప్రభుత్వ సంస్థలకు, ఐఏఎస్, ఐపీఎస్, ఎమ్మెల్యేలు, ఎంపీలకు, న్యాయమూర్తులకు, ఇతర ఉద్యోగులకు కేటాయించిన మొత్తం భూమి 1800 ఎకరాల వరకు మాత్రమే ఉందని అలాంటప్పుడు అమరాతిలో ఏకంగా 35వేల ఎకరాలు ఎందుకు సేకరించారని ఉండవల్లి ప్రశ్నించారు. వీటిపై సీబీఐ విచారణ జరిపితే అసలు విషయం బయటకు వస్తుందన్నారు.
ప్రపంచంలో పెద్దపెద్ద కుంభకోణాలకు మూలాలు సింగపూర్లో ఉంటున్నాయని ఉండవల్లి చెప్పారు. బ్రెజిల్‌లో అతిపెద్ద కుంభకోణం చేసిన సెంబ్ కార్ప్, అసెండాస్‌లు ఇప్పుడు అమరావతి కట్టేందుకు సిద్ధపడుతున్నాయన్నారు. ఇండోనేషియాలో దోచేసిన డబ్బంతా ఇప్పుడు సింగపూర్ బ్యాంకుల్లో ఉందన్నారు. అవినీతి, అక్రమాలు, దోపిడిలు చేసిన వారందరికీ సింగపూరే స్థావరమన్నారు. అలాంటి సింగపూర్‌ను చంద్రబాబు ఆదర్శంగా తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు.
Advertisement