బ్రిక్స్ చలనచిత్రోత్సవానికి బాహుబలి
బ్రిక్స్ దేశాల తొలి చలన చిత్రోత్సవం సెప్టెంబర్ 2, 6 తేదీల మధ్య ఢిల్లీలోని సిరిఫోర్ట్ ఆడిటోరియం కాంప్లెక్స్‌లో జరుగనుంది. రష్యాలో చివరిసారిగా జరిగిన బ్రిక్స్ దేశాల సదస్సులో ప్రధాని నరేంద్రమోదీ ఈ చలనచిత్రోత్సవం గురించి ప్రకటించారు. ఈ చలనచిత్రోత్సవంలో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాల నుంచి 4 చిత్రాల చొప్పున ప్రదర్శిస్తారు. భారత్ నుంచి ప్రదర్శించే చిత్రాల్లో బాహుబలి, బాజీరావ్ మస్తానీ, సినిమావాలా, తిథి ఉన్నాయి. ఇందులో ఎంపికైనవాటికి ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, […]
బ్రిక్స్ దేశాల తొలి చలన చిత్రోత్సవం సెప్టెంబర్ 2, 6 తేదీల మధ్య ఢిల్లీలోని సిరిఫోర్ట్ ఆడిటోరియం కాంప్లెక్స్‌లో జరుగనుంది. రష్యాలో చివరిసారిగా జరిగిన బ్రిక్స్ దేశాల సదస్సులో ప్రధాని నరేంద్రమోదీ ఈ చలనచిత్రోత్సవం గురించి ప్రకటించారు. ఈ చలనచిత్రోత్సవంలో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాల నుంచి 4 చిత్రాల చొప్పున ప్రదర్శిస్తారు. భారత్ నుంచి ప్రదర్శించే చిత్రాల్లో బాహుబలి, బాజీరావ్ మస్తానీ, సినిమావాలా, తిథి ఉన్నాయి. ఇందులో ఎంపికైనవాటికి ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, ఉత్తమ నటుడితోపాటు, ప్రత్యేక జ్యూరీ అవార్డులు అందజేస్తారు. విజేతలకు బ్రిక్స్ బంగారు పతకంతోపాటు, ప్రశంసాపత్రం బహూకరిస్తారు. ఈ చలనచిత్రోత్సవం ముగింపు సందర్భంగా 6వ తేదీ భారతీయ చలన చిత్ర సుదీర్ఘ ప్రయాణంపై ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటుచేస్తున్నారు. అక్టోబర్ 15, 16 తేదీల్లో గోవాలో జరిగే బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సమావేశాన్ని దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం ఈ చిత్రోత్సవాన్ని నిర్వహిస్తోంది. కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఈ విషయాల్ని వెల్లడించారు. ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న బాహుబలి.. బ్రిక్స్ ఫిలిం ఫెస్టివల్ లో కూడా అవార్డు అందుకుంటుందా లేదా అనేది చూడాలి. ఈసారి బాహుబలికి దేశీయంగా బాజీరావ్ మస్తానీతో పాటు… చైనా సినిమాల నుంచి ప్రధానంగా పోటీ ఎదురుకాబోతోంది.