పుష్కర స్నాన ఘట్టాల్లో "పచ్చ వైరస్"
ఏ విషయాన్నైనా ప్రచారం చేసుకోవడంలో టీడీపీకి మించిన పార్టీ మరొకటి ఉండదు. స్వతహాగా పార్టీ అధ్యక్షుడే మీడియా మేనేజ్‌మెంట్‌లో దిట్ట కావడంతో పార్టీ కార్యకర్తలు కూడా అదే విధంగా ముందుకెళ్తున్నారు. తాజాగా పుష్కరాల్లో టీడీపీ కొత్తరకం ప్రచారం మొదలుపెట్టింది. ఆ ప్రచారం జనాలకు బ్రెయిన్ వాష్ చేసే తరహాలో ఉంటోంది. పుష్కర ఘాట్ల వద్ద ఇద్దరు ముగ్గురు కూడినా తెలుగు తమ్ముళ్ల టీంలు సంచరిస్తున్నాయి. వారు చేస్తున్న ప్రచారం చాలా సింపుల్. పుష్కరస్నానం చేసి కాసేపు పక్కన […]
ఏ విషయాన్నైనా ప్రచారం చేసుకోవడంలో టీడీపీకి మించిన పార్టీ మరొకటి ఉండదు. స్వతహాగా పార్టీ అధ్యక్షుడే మీడియా మేనేజ్‌మెంట్‌లో దిట్ట కావడంతో పార్టీ కార్యకర్తలు కూడా అదే విధంగా ముందుకెళ్తున్నారు. తాజాగా పుష్కరాల్లో టీడీపీ కొత్తరకం ప్రచారం మొదలుపెట్టింది. ఆ ప్రచారం జనాలకు బ్రెయిన్ వాష్ చేసే తరహాలో ఉంటోంది. పుష్కర ఘాట్ల వద్ద ఇద్దరు ముగ్గురు కూడినా తెలుగు తమ్ముళ్ల టీంలు సంచరిస్తున్నాయి. వారు చేస్తున్న ప్రచారం చాలా సింపుల్. పుష్కరస్నానం చేసి కాసేపు పక్కన కూర్చున్న భక్తుల దగ్గరకు వెళ్లి నిలబడుతారు. తర్వాత బాబు భజన మొదలుపెడుతారు. పక్కనే ఉన్న భక్తులకు వినిపించేలా వీరిలో వీరే చంద్రబాబు ఖ్యాతిని చర్చించుకుంటారు. ”ఏం పుష్కరాలండి. ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నారు. చంద్రబాబు నిజంగా గ్రేట్ అండి. అలాంటి వ్యక్తి మనకు సీఎంగా దొరకడం అదృష్టం. లోటు బడ్జెట్‌లో ఉన్నా రాష్ట్రాన్ని ఇంత ధైర్యంగా ముందుకు తీసుకెళ్తున్నారు. చూడండి ఇన్ని లక్షల మంది వచ్చినా ఎక్కడా ఇబ్బంది లేకుండా చేయగలిగారు” అంటూ భక్తులకు వినిపించేలా తెలుగుతమ్ముళ్ల బృందాలు తమలో తాము చర్చించుకుంటున్నట్టుగా నటిస్తున్నాయి. మరికొన్ని సార్లు భక్తులతో మాటలు కలుపుతున్నారు.
అలా మాటలు కలుపుతూనే చంద్రబాబు ఖ్యాతిని ప్రచారం చేస్తున్నారు. ఇలా తెలుగు తమ్ముళ్ల టీంలు నిత్యం పుష్కరఘాట్ల వద్ద సామాన్య జనంలాగా తిరుగుతూ బాబుకు ప్రచారం చేస్తున్నారు. భక్తుల మైండ్ సెట్‌ను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారు. వీరి బాబు డబ్బా సౌండ్‌పై భక్తులెవరైనా రివర్స్‌లో స్పందిస్తే అక్కడి నుంచి తెలుగు తమ్ముళ్లు పక్కకు జారుకుంటారు. ఇదంతా పార్టీ నాయకత్వం ఆదేశాల మేరకే ఒక పద్దతి ప్రకారం జరుగుతున్న ప్రచారమని భావిస్తున్నారు. పుష్కరాలకు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి జనం వస్తారు కాబట్టి… పుష్కరాలు అద్భుతంగా జరుగుతున్నాయన్న భ్రమను వాళ్లకు కల్పిస్తే కొందరు అమాయక భక్తులు కూడా తమ ఊర్లకు వెళ్లిన తర్వాత చంద్రబాబు పుష్కరాల గురించి పాజిటివ్‌గానే చుట్టుపక్కల వాళ్లకు చెబుతున్నారన్నది పచ్చపార్టీ భావనగా చెబుతున్నారు. ఒక విధంగా పుష్కరాల వేదికపై అక్కడికి వచ్చిన భక్తులకు తెలుగుతమ్ముళ్లు పచ్చ వైరస్ అంటించి పంపుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రచార వ్యూహం మాత్రం అదిరింది కదూ!.
Click on Image to Read: