ఎంగిలి విస్తర్లపై వెంపర్లాట...

వెనుకటికి ఒకాయన ఒకరికి ఒక పూట అన్నం పెట్టి ఆరు ఊర్లలో ఆరు దినాలు ప్రచారం చేసుకున్నాడట. అలాగే ఉంది చంద్రబాబు పరిస్థితి. ఇప్పటికే ప్రచారయావతో ఏ చిన్న పాయింట్‌నూ వదిలిపెట్టని చంద్రబాబు ఇప్పుడు అన్నం మెతుకుల దగ్గరా ప్రచార మెరుపులు కోరుకుంటున్నారు. పుష్కరాలకు వచ్చిన భక్తులకు పెట్టిన అన్నం విస్తర్లను లెక్కేసుకుంటున్నారు. ఎంతమందికి అన్నం పెట్టామన్న విషయం అంచనా కోసం లెక్కేసుకుంటే తప్పులేదు. అయితే ఎంగిలి విస్తరి ద్వారా గిన్నిస్ రికార్డు కోరుకుంటున్నారు. పుష్కర ఫుడ్‌కు రియో […]

Advertisement
Update:2016-08-22 12:19 IST

వెనుకటికి ఒకాయన ఒకరికి ఒక పూట అన్నం పెట్టి ఆరు ఊర్లలో ఆరు దినాలు ప్రచారం చేసుకున్నాడట. అలాగే ఉంది చంద్రబాబు పరిస్థితి. ఇప్పటికే ప్రచారయావతో ఏ చిన్న పాయింట్‌నూ వదిలిపెట్టని చంద్రబాబు ఇప్పుడు అన్నం మెతుకుల దగ్గరా ప్రచార మెరుపులు కోరుకుంటున్నారు. పుష్కరాలకు వచ్చిన భక్తులకు పెట్టిన అన్నం విస్తర్లను లెక్కేసుకుంటున్నారు. ఎంతమందికి అన్నం పెట్టామన్న విషయం అంచనా కోసం లెక్కేసుకుంటే తప్పులేదు. అయితే ఎంగిలి విస్తరి ద్వారా గిన్నిస్ రికార్డు కోరుకుంటున్నారు.

పుష్కర ఫుడ్‌కు రియో ఒలింపిక్స్‌కు లింకు కలిపి ప్రసంగించారు చంద్రబాబు. రియో ఒలింపిక్స్‌లో రోజుకు 50వేలమందికి మాత్రమే ఆహారం అందించారని తెలిపారు. విజయవాడ పుష్కరఘాట్ల దగ్గర మాత్రం ఒక్క రోజే రెండు లక్షల మందికి అన్నదానం చేశామని చెప్పుకున్నారు. ఇది ప్రపంచ రికార్డు అని ఈ వివరాలను గిన్నిస్‌ బుక్‌ రికార్డుకు పంపాలని అధికారులకు సూచించారు. ఇంకా నయం గిన్నిస్ బుక్‌ వాళ్లకు చూపెట్టేందుకు ఎంగలి విస్తర్లను ఎన్నిరోజులైనా సరే జాగ్రత్తగా భద్రపరచండి అని చెప్పలేదు. అయినా కృష్ణపుష్కరాల్లో భోజనాలు పెడుతున్న వాటిలో ప్రభుత్వం కంటే స్వచ్చంద సంస్థలే చురుగ్గా పనిచేస్తున్నాయి. సొంత ప్రజలకు పెట్టిన ఆహారంపైనా రికార్డులు కావాలనుకోవడం ఏమిటో!.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News