బాహుబలి-2 చాలా చిన్నదంట...
బాహుబలి ప్రపంచవ్యాప్తంగా అద్భుత విజయాన్ని అందుకోవడంతో రెండో భాగంపై ఓ రేంజ్ లో ఫోకస్ పెట్టిన రాజమౌళి అండ్ టీమ్.. కొత్తగా మార్పులు చేర్పులు చేసి బాహుబలి-2 కి అదనపు హంగులు అద్దినట్లు ఇప్పటివరకు వింటూ వచ్చాం. కానీ, ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా బాహుబలి-2 గురించి ఓ షాకింగ్ న్యూస్ టాలీవుడ్ లో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకి రాజమౌళి ముందు అనుకున్న స్క్రిప్ట్ ప్రకారం తప్ప ఒక్క సీన్ కూడా […]
బాహుబలి ప్రపంచవ్యాప్తంగా అద్భుత విజయాన్ని అందుకోవడంతో రెండో భాగంపై ఓ రేంజ్ లో ఫోకస్ పెట్టిన రాజమౌళి అండ్ టీమ్.. కొత్తగా మార్పులు చేర్పులు చేసి బాహుబలి-2 కి అదనపు హంగులు అద్దినట్లు ఇప్పటివరకు వింటూ వచ్చాం. కానీ, ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా బాహుబలి-2 గురించి ఓ షాకింగ్ న్యూస్ టాలీవుడ్ లో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకి రాజమౌళి ముందు అనుకున్న స్క్రిప్ట్ ప్రకారం తప్ప ఒక్క సీన్ కూడా అదనంగా కలపడం లేదట. ఈ క్రమంలోనే బాహుబలి-ది కంక్లూజన్ రన్ టైమ్ కేవలం గంటా 45 నిమిషాలు మాత్రమే ఉంటుందనే న్యూస్ ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇదే గనుక నిజమైతే బాహుబలి ఫ్యాన్స్ కు ఇంతకంటే పెద్ద షాకింగ్ న్యూస్ ఇంకోటి ఉండదు. బాహుబలి పార్ట్-1ను వివిధ దేశాల్లో విడుదల చేసినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు మేకర్స్. ఎడిట్ చేసిన ఫుటేజ్ ను మళ్లీ ఎడిట్ చేసి, పాటలు తీసేసి, ఫైట్లు కుదించి ఇలా చాలా మార్పులు చేశారు. దీంతో సమయం వృధా అవ్వడంతో పాటు… డబ్బు కూడా ఖర్చయింది. అందుకే పార్ట్-2ను ఎలాంటి ఎడిటింగ్ ఇబ్బందులు లేకుండా… అన్ని దేశాల్లో, అన్ని భాషల్లో ఒకేలా ఉండేలా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారట.
Click to Read