మొహంజదారో ప్లాప్ కు 7 కారణాలు..
లగాన్, స్వదేశ్, జోధా అక్బర్ లాంటి భారీ చిత్రాలను తెరకెక్కించిన అశుతోష్ గోవరికర్ దర్శకత్వం, హృతిక్ రోషన్ లాంటి పెద్ద బాలీవుడ్ స్టార్, ఇప్పటి వరకు ఎవ్వరూ టచ్ చేయని మొహంజొదారో చారిత్రక నేపథ్యం, వందల కోట్ల రూపాయల ఖర్చు, భారీ సెట్టింగులు, సుధీర్ఘ కాలం పాటు సాగిన షూటింగ్….. వెరసి ఇండియన్ సినిమా చరిత్రలో రాబోతున్న మరో గొప్ప సినిమాగా సినిమా రిలీజ్ ముందు వరకు ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉండేవి. భారీ అంచనాల […]
Advertisement
లగాన్, స్వదేశ్, జోధా అక్బర్ లాంటి భారీ చిత్రాలను తెరకెక్కించిన అశుతోష్ గోవరికర్ దర్శకత్వం, హృతిక్ రోషన్ లాంటి పెద్ద బాలీవుడ్ స్టార్, ఇప్పటి వరకు ఎవ్వరూ టచ్ చేయని మొహంజొదారో చారిత్రక నేపథ్యం, వందల కోట్ల రూపాయల ఖర్చు, భారీ సెట్టింగులు, సుధీర్ఘ కాలం పాటు సాగిన షూటింగ్….. వెరసి ఇండియన్ సినిమా చరిత్రలో రాబోతున్న మరో గొప్ప సినిమాగా సినిమా రిలీజ్ ముందు వరకు ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉండేవి. భారీ అంచనాల మధ్య ఆగస్టు 12న రిలీజైన ఈ చిత్రం…. ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది. వారం గడిచేలోపు సినిమా ప్లాప్ అని తేలిపోయింది.
బాహుబలి రికార్డులను బద్దలు కొడుతుందని భావించినా ఈ సినిమా బాక్సాఫీసు వద్ద అద్భుతాలు సృష్టించడంలో పూర్తిగా విఫలం అయింది. భారతీయులంతా చిన్న తనం నుండి పుస్తకాల్లో… హరప్పా, మొహంజోదారో కాలం నాటి సంస్కృతి గురించి చదువుకున్నారు. దీంతో ‘మొహంజోదారో’ పేరుతో ఆ కాలం నాటి పరిస్థితులను ఫోకస్ చేస్తూ సినిమా వస్తుందనే విషయం తెలియగానే అందరిలోనూ సినిమాపై ఆసక్తి పెరిగింది. అయితే ఎన్నో అంచనాలతో థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు….సినిమాలో అసలు విషయం లేక పోవడం, చారిత్రక నేపథ్యం అని చెప్పి కొరసు మాత్రమే దర్శకుడు చూపించడంతో నిరాశ తప్పలేదు. సినిమా ప్లాప్ అవ్వడానికి గల 7 ప్రధాన కారణాలు…
1.సినిమాలో ఓవర్ డ్రమటిక్ స్టోరీ ఉండటం సినిమాను ప్రేక్షకులు తిరస్కరించడానికి ప్రధాన కారణం.
2.సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కూడా సరిగా లేవు. ఇంత ఖర్చు పెట్టించిన దర్శకుడు ఈ విషయంలో సరైన శ్రద్ధ పెట్టక పోవడం కూడా సినిమా ప్లాప్ అవ్వడానికి మరో కారణం.
3.సినిమాలో నటీనటులకు వాడిన కాస్ట్యూమ్స్….ఆకాలం నాటి పరిస్థితులకు తగిన విధంగా లేవు. దీంతో సినిమా రియల్ లుక్ కోల్పోయినట్లయింది.
4.సినిమాలో నటీనటుల యాక్టింగ్ గ్రేట్ గా ఉన్నా… స్టోరీ లైన్ చాలా పూర్ గా ఉండటం కూడా సినిమా ప్లాప్ అవ్వడానికి ప్రధాన కారణం.
5.ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి కారణం మొహంజొదారో చరిత్ర సినిమాలో ఉంటుందని ప్రేక్షకుడు భావించడమే, కానీ సినిమాలో అలాంటిదేమీ లేక పోవడంతో అంతా నిరాశ పడ్డారు.
6.సినిమా క్లైమాక్స్ కూడా ఆసక్తికరంగా లేక పోవడం కూడా సినిమాకు పెద్ద మైనస్.
7.సినిమాపై అంచనాలు మొదటి నుండి భారీగా ఉండటం, అంచనాలను అందుకునే రేంజ్లో సినిమా లేక పోవడం ప్రధాన కారణంగా పరశీలకులు తేల్చారు మరి.
Advertisement