చిన్ననాటి స్నేహితుని చంపేశాడు...హత్య చుట్టూ అనేక కథనాలు!
హర్యానాలోని గుర్‌గావ్‌లో 38ఏళ్ల నీరజ్ తన చిన్ననాటి స్నేహితుడు అరుణ్ చేతుల్లో హత్యకు గురయ్యాడు. ఈ హత్య చుట్టూ పలు కథనాలు చిక్కుముళ్లు… ఉండగా పోలీసులు కేసుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం నీరజ్ ని అరుణ్ డిఎల్ఎఫ్ ఫేస్-3లోని నీరజ్ ఆఫీసులోనే హత్య చేశాడు. గురువారం రాత్రి హత్య జరిగిన వెంటనే ప్రియా ఠాకూర్ అనే యువతి పోలీస్ కంట్రోల్ రూముకి ఫోన్ చేసి తానే నీరజ్‌ని హత్యచేసినట్టుగా చెప్పింది. అతను తనపై […]
హర్యానాలోని గుర్‌గావ్‌లో 38ఏళ్ల నీరజ్ తన చిన్ననాటి స్నేహితుడు అరుణ్ చేతుల్లో హత్యకు గురయ్యాడు. ఈ హత్య చుట్టూ పలు కథనాలు చిక్కుముళ్లు… ఉండగా పోలీసులు కేసుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం నీరజ్ ని అరుణ్ డిఎల్ఎఫ్ ఫేస్-3లోని నీరజ్ ఆఫీసులోనే హత్య చేశాడు. గురువారం రాత్రి హత్య జరిగిన వెంటనే ప్రియా ఠాకూర్ అనే యువతి పోలీస్ కంట్రోల్ రూముకి ఫోన్ చేసి తానే నీరజ్‌ని హత్యచేసినట్టుగా చెప్పింది. అతను తనపై అత్యాచారం చేయబోగా చంపేశానని ఆమె పేర్కొంది. అయితే పోలీసులు ఆమెని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా…ఆమె మాటమార్చి…అరుణ్ భార్యతో నీరజ్ అక్రమ సంబంధం కలిగి ఉన్నాడని, అందుకే అరుణే… నీరజ్ ని చంపేశాడని చెప్పింది. పోలీసులు దర్యాప్తు చేయగా మరిన్ని వివరాలు బయటపడ్డాయి.
ముందు అరుణ్, ప్రియ కలిసి నీరజ్ని స్పృహ తప్పించి అతనిపై…రేప్ కేసు నమోదు అయ్యేలా చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఆప్లాన్ బెడిసి కొట్టి… నిజంగానే నీరజ్ ని అరుణ్ హత్య చేసినట్టుగా తెలుస్తోందని పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే నీరజ్ని అరుణ్ కలిసిన సమయంలో… నీరజ్ అన్న నితిన్ తమ్ముడి ఆఫీస్కి వచ్చాడు. ఆ రాత్రి ఎనిమి దిన్నర వరకు తాను ఆఫీస్లోనే ఉన్నానని, అప్పుడు తమ చిన్ననాటి స్నేహితుడు అరుణ్ సర్కార్, ప్రియతో కలిసి వచ్చాడని, తాను చూశానని నితిన్ చెప్పాడు.
నీరజ్ హత్యపై ప్రియ చెబుతున్నవన్నీ అబద్దాలేనని…తన తమ్ముడి హత్య వెనుక పెద్ద కుట్ర ఉందని నితిన్ అంటున్నాడు. వారిద్దరూ కలిసి అనేక మోసాలకు పాల్పడ్డారని అవన్నీ తన తమ్ముడికి తెలవటం వల్లనే హత్య చేశారని అతను పోలీసులకు చెప్పాడు. అరుణ్ పలు మోసాలకు పాల్పడి ఇప్పటికే చాలాసార్లు జైలుకి వెళ్లి వచ్చాడని, ఈ మధ్యకాలంలో… అరుణ్ మరో కోటి రూపాయిల మోసం నేరం చేశాడని నీరజ్ తనకు చెప్పాడని నితిన్ వెల్లడించాడు. నీరజ్ అవన్నీ బయటపెడతాడనే భయంతోనే అతడిని అరుణ్, ప్రియ కలిసి చంపేశారని నితిన్ ఆరోపించాడు.
Click on Image to Read: