కంటెంట్ లో దమ్ముంటే కటౌట్ తో పనిలేదు

ఈ ఇంట్రడక్షన్ బిచ్చగాడికి సరిగ్గా సరిపోతుంది. అవును.. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. మరీ ముఖ్యంగా ఓ హీరో బిచ్చగాడు టైటిల్ తో సినిమా చేయడం ఏంటని కొందరు నవ్వుకున్నారు కూడా. ఇంకా ముఖ్యంగా బన్నీ నటించిన రేసుగుర్రం బరిలో ఉన్న టైమ్ లో వచ్చిన బిచ్చగాడును ఎవరూ కన్నెత్తి కూడా చూడలేదు. కానీ కంటెంట్ లో దమ్ముంటే కటౌట్ తో పనిలేదని నిరూపించాడు బిచ్చగాడు. ఎంతోమంది స్టార్ హీరోలు కూడా ఈమధ్య కాలంలో […]

Advertisement
Update:2016-08-20 12:25 IST

ఈ ఇంట్రడక్షన్ బిచ్చగాడికి సరిగ్గా సరిపోతుంది. అవును.. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. మరీ ముఖ్యంగా ఓ హీరో బిచ్చగాడు టైటిల్ తో సినిమా చేయడం ఏంటని కొందరు నవ్వుకున్నారు కూడా. ఇంకా ముఖ్యంగా బన్నీ నటించిన రేసుగుర్రం బరిలో ఉన్న టైమ్ లో వచ్చిన బిచ్చగాడును ఎవరూ కన్నెత్తి కూడా చూడలేదు. కానీ కంటెంట్ లో దమ్ముంటే కటౌట్ తో పనిలేదని నిరూపించాడు బిచ్చగాడు. ఎంతోమంది స్టార్ హీరోలు కూడా ఈమధ్య కాలంలో సాధించలేకపోతున్న వంద రోజుల ఘనతను సంపాదించాడు. అవును.. ఈరోజుతో బిచ్చగాడు సినిమా వంద రోజులు పూర్తిచేసుకుంది. ఓ డబ్బింగ్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో వంద రోజులు ఆడడం అంటే మామూలు విషయం కాదు. ఈమధ్య కాలంలో వచ్చిన రజనీకాంత్, సూర్య, అజిత్, విజయ్ లాంటి హీరోల డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు రాష్ట్రాల్లో వంద రోజులు ఆడలేదు. కానీ బిచ్చగాడు ఆడేసింది.

ఇదేదో ఆయాచితంగా జరిగిపోలేదు. సినిమా కథలో ఉన్న దమ్ము అది. కథ కొత్తగా ఉంటే హీరోతో పనిలేదని, 6 పాటలు, 4 ఫైట్ల ఫార్మాట్ అస్సలు అక్కర్లేదని నిరూపించింది బిచ్చగాడు సినిమా. కేవలం 20లక్షల రూపాయలు పెట్టి చదలవాడ తిరుపతిరావు ఈ సినిమాను కొన్నారు. అది ఇప్పుడు అతడికి ఏకంగా 25 కోట్ల రూపాయలు ఆర్జించి పెట్టింది. అంతేకాదు.. వచ్చేవారం ఈ సినిమాను అమెరికాలో కూడా విడుదల చేస్తున్నారు. దటీజ్ బిచ్చగాడు.

Tags:    
Advertisement

Similar News