భలే ఇరికించేశారు బాస్...

డామిట్ కథ అడ్డ తిరిగింది. అనుకున్నది అనుకున్నట్టు జరగలేదు. జగన్‌ను పుష్కరాలకు ఆహ్వానించే విషయంలో టీడీపీ నేతలు ఒకటి తలిస్తే మరొకటి జరిగినట్టుగా ఉంది. ఏ సాంప్రదాయంలో లేని విధంగా పుష్కరాలు ప్రారంభమయ్యాక జగన్‌ను ఆహ్వానించేందుకు టీడీపీ నేతలు వచ్చారు. ఒక కార్యక్రమం మొదలైన తర్వాత ఆహ్వానం పలకడం అంటే ఒక విధంగా అవమానించడమే. అలాంటి పిలుపును ఎవరూ స్వీకరించరు. కానీ చంద్రబాబు డైరెక్షన్‌లో దళిత మంత్రి రావెల కిషోర్‌బాబును జగన్ ఇంటికి పంపారు. రాత్రి కలవడానికి […]

Advertisement
Update:2016-08-13 13:31 IST

డామిట్ కథ అడ్డ తిరిగింది. అనుకున్నది అనుకున్నట్టు జరగలేదు. జగన్‌ను పుష్కరాలకు ఆహ్వానించే విషయంలో టీడీపీ నేతలు ఒకటి తలిస్తే మరొకటి జరిగినట్టుగా ఉంది. ఏ సాంప్రదాయంలో లేని విధంగా పుష్కరాలు ప్రారంభమయ్యాక జగన్‌ను ఆహ్వానించేందుకు టీడీపీ నేతలు వచ్చారు. ఒక కార్యక్రమం మొదలైన తర్వాత ఆహ్వానం పలకడం అంటే ఒక విధంగా అవమానించడమే. అలాంటి పిలుపును ఎవరూ స్వీకరించరు. కానీ చంద్రబాబు డైరెక్షన్‌లో దళిత మంత్రి రావెల కిషోర్‌బాబును జగన్ ఇంటికి పంపారు. రాత్రి కలవడానికి వీలు కాలేదు. అంతే దళితులను అవమానించారంటూ కథనాలు రాయించుకున్నారు అనుకూలమీడియాలో. తిరిగి శనివారం ఉదయం వచ్చి జగన్‌ను ఆహ్వానం పలికారు. అలా ఆహ్వానపత్రం ఇచ్చి బయటకు వచ్చిన రావెల కిషోర్ బాబు… జగన్ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. తాము పిలిచేందుకు వచ్చినా స్పందించపోవడం ఏమిటని కారులో కూర్చుని మీడియా ముందు వాపోయారు.

జగన్ ప్రతివిషయాన్ని రాజకీయం చేస్తున్నారని, కానీ తామే పెద్ద మనసు చేసుకుని ఆహ్వానించేందుకు వచ్చామని చెప్పి వెళ్లిపోయారు. రావెల మాటలు వింటే… జగన్‌ ఉదయం దళిత మంత్రిని సరిగా రిసీవ్ చేసుకోలేదన్న భావన కలిగింది. కానీ టీడీపీ మంత్రి రావెల మాటల్లో నిజం లేదని దానికి సంబంధించిన ఒక వీడియో బయటకు వచ్చింది. ఆహ్వానించేందుకు వచ్చిన మంత్రి రావెల, విప్ కూన రవికుమార్‌ను జగన్ పక్కనే కూర్చోబెట్టుకుని కాపీ ఇచ్చిన సన్నివేశం కూడా అందులో ఉంది. ఆ వీడియోలో చాలా మర్యాదగానే రావెలను జగన్ డీల్ చేసినట్టు ఉంది. ఆహ్వానపత్రం కూడా జగనే నేరుగా తీసుకున్నారు. అయితే ఈ వీడియో అప్పటికప్పుడు సెల్‌ఫోన్లో తీసినట్టుగా ఉంది. బహుశా టీడీపీ నేతలకు ఇంత మర్యాద చేసినా కూడా బయటకు వెళ్లి తమను అవమానిస్తారని మీడియా ముందు చెప్పుకుంటారన్న ముందు జాగ్రత్తలోనే వైసీపీ వారే ఈ దశ్యాలను రికార్డు చేసినట్టు చెబుతున్నారు. అయితే రాత్రి జగన్‌ కలవకపోయే సరికి దళిత మంత్రిని అవమానించిన జగన్ అని కథనాలు రాసిన బాబు మీడియా… అదే దళిత మంత్రికి కాపీ ఇచ్చి మర్యాద చేసిన విషయాన్ని మాత్రం రాయలేదు.

Full View

 

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News