పులివెందుల కోట బద్ధలు కొడుతా... పులీ..!

పులివెందుల్లో కొత్త కోడి కాలుదువ్వుతోంది. ఏకంగా కంచుకోటను బద్ధలుకొడుతా అంటూ ఊర్లు ఊర్లు తిరుగుతోంది. ఈ నేత ఊపుచూసి జనం కూడా ఆగి మరీ ఆలోచిస్తున్నారు. ఇప్పటి వరకు పులివెందుల్లో సతీష్ రెడ్డి టీడీపీ తరపున పోటీ చేసే వారు. అయితే ఎప్పుడూ ఆయన విజయం సాధించలేదు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, మండలి డిప్యూటీ చైర్మన్‌గా సతీష్ రెడ్డి ఉన్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో పులివెందుల నుంచి టీడీపీ తరపున తాను పోటి చేస్తున్నానంటూ పులివెందుల మార్కెట్ యార్డ్ మాజీ […]

Advertisement
Update:2016-08-13 05:20 IST

పులివెందుల్లో కొత్త కోడి కాలుదువ్వుతోంది. ఏకంగా కంచుకోటను బద్ధలుకొడుతా అంటూ ఊర్లు ఊర్లు తిరుగుతోంది. ఈ నేత ఊపుచూసి జనం కూడా ఆగి మరీ ఆలోచిస్తున్నారు. ఇప్పటి వరకు పులివెందుల్లో సతీష్ రెడ్డి టీడీపీ తరపున పోటీ చేసే వారు. అయితే ఎప్పుడూ ఆయన విజయం సాధించలేదు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, మండలి డిప్యూటీ చైర్మన్‌గా సతీష్ రెడ్డి ఉన్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో పులివెందుల నుంచి టీడీపీ తరపున తాను పోటి చేస్తున్నానంటూ పులివెందుల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పేర్ల పార్థసారథి ప్రకటించుకున్నారు. ఇందులో భాగంగా ఇటీవల మినీ బస్సువేసుకుని ఊర్లలో తిరుగుతున్నారు.శుక్రవారం వేములలోని బస్టాండ్‌ సెంటర్‌లో మీటింగ్ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేస్తున్నానని అందరూ ఆశీర్వదించాలని కోరారు. 30ఏళ్లుగా ఒకే కుటుంబానికి పులివెందుల కంచుకోటగా ఉందని దాన్ని తాను బద్ధలు కొడుతానని ప్రకటించారు. పులివెందుల ప్రజల కోసమే తాను బరిలో దిగాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. తనను గెలిపిస్తే పులివెందులను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్నారు.

పేర్ల పార్థసారథి మీటింగ్‌లో ప్రసంగిస్తుండగా జనం ఆసక్తిగా నిలబడి విన్నారు. ”పులివెందుల కంచుకోటను బద్ధలు కొడుతా, పులివెందుల ప్రజల కోసమే నేను వచ్చా” వంటి డైలాగులను చెప్పినప్పుడు జనం ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. పార్థసారథి సభకు వందల సంఖ్యలో జనం వచ్చారు. అయినా పార్టీ అభ్యర్థులను ఏడాది ముందు లేకుంటే ఆరు నెలల ముందు ప్రకటించడం చూశాం … పులివెందులకు మాత్రం చంద్రబాబు నాలుగేళ్ల ముందే అభ్యర్థిని ప్రకటించారు కాబోలు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News