జగన్‌ బారి నుంచి లోకేష్ ను రక్షిస్తారా?

”మా తాతలు నేతులు తాగారు… ఇప్పుడు మీరు నా మూతుల వాసన చూడండి” అన్నట్టుగా ఉంది నారాలోకేష్‌ తీరు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన లోకేష్…  తన తాత రామారావును  చూపించి తామూ అంతేనని చెప్పారు. ప్రత్యేక హోదా సెంటిమెంట్‌కు మనుమడు సెంటిమెంట్‌ను లింక్‌ పెట్టి అబ్బురపరిచే ప్రయత్నం చేశారు. ప్రత్యేక హోదా సంగతేంటని మీడియా ప్రశ్నించగా… ఆవు కథ ఎత్తుకున్నారు లోకేష్. ”ఇందిరా గాంధీనే ఒకప్పుడు భయపెట్టాం. హోదా కోసం పోరాడుతున్నాం. పోరాడుతూనే ఉంటాం. రెండేళ్లలో చంద్రబాబు […]

Advertisement
Update:2016-08-11 05:37 IST

”మా తాతలు నేతులు తాగారు… ఇప్పుడు మీరు నా మూతుల వాసన చూడండి” అన్నట్టుగా ఉంది నారాలోకేష్‌ తీరు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన లోకేష్… తన తాత రామారావును చూపించి తామూ అంతేనని చెప్పారు. ప్రత్యేక హోదా సెంటిమెంట్‌కు మనుమడు సెంటిమెంట్‌ను లింక్‌ పెట్టి అబ్బురపరిచే ప్రయత్నం చేశారు. ప్రత్యేక హోదా సంగతేంటని మీడియా ప్రశ్నించగా… ఆవు కథ ఎత్తుకున్నారు లోకేష్. ”ఇందిరా గాంధీనే ఒకప్పుడు భయపెట్టాం. హోదా కోసం పోరాడుతున్నాం. పోరాడుతూనే ఉంటాం. రెండేళ్లలో చంద్రబాబు 30 సార్లు హోదాకోసం ఢిల్లీ వెళ్లారు. తన మనుమడిని చూసేందుకు కూడా ఇన్నిసార్లు హైదరాబాద్ రాలేదు. హోదా విషయంలో యువభేరీల పేరుతో జగన్ యూత్‌ను తప్పుదారి పట్టిస్తున్నారు” అని లోకేష్ విమర్శించారు. అంతలోనే హోదా వల్ల పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదు. ఉత్తరాఖండ్‌కు హోదా ఉన్నా కనీసం ఐదు వేల ఉద్యోగాలు కూడా రాలేదని లోకేష్ చెప్పారు.

అయినా ఇందిరా గాంధీని ఒకప్పుడు భయపెట్టారా లేదా అన్నది వేరే విషయం. ఇప్పుడు మోదీని ఎంత వరకు భయపెడుతున్నారో చెబితే బాగుంటుంది. అయినా ఇందిరా హయాంలో ఎన్టీఆర్ ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు ఉన్నారు. కాబట్టి మోదీని భయపెట్టే యోచన ఉందో లేదో చెబితే బాగుంటుంది. ఇక మాటకు ముందు మనుమడిని కూడా చూసుకోలేకపోతున్నాన్న చీప్‌ సెంటిమెంట్‌ డైలాగ్‌ వింటేనే జనానికి చీరాకు వచ్చేస్తోంది. అయినా చంద్రబాబు ఏమైనా దుబాయిలో వలసకూలీ జీవితం గడుపుతున్నారా?. విజయవాడలో లగ్జరీగా కట్టిన కరకట్ట అక్రమ బిల్డింగ్‌లోనే ఉంటున్నారు. ఫ్యామిలీ మొత్తం వెళ్లి అక్కడ ఉంటే ప్రతిపక్షాలు ఏమైనా వద్దంటాయా?. ఒక పక్క హైదరాబాద్ స్టార్ హోటల్లో కాపురం పెట్టి … మరో పక్క మనుమడి సెంటిమెంట్‌తో జనానికి పూలెందుకు పెడుతారో!. యువభేరీల పేరుతో జగన్‌ యూత్‌ను తప్పుదారి పట్టిస్తుంటే లోకేష్ కూడా రివర్స్ భేరీలు పెట్టి జగన్ బారి నుంచి యూత్‌ను రక్షించవచ్చుగా!. ఇవన్నీ వదిలేసి మా నాన్న 30సార్లు ఢిల్లీ వెళ్లారు. మనుమడిని చూసుకోలేకపోతున్నారు. అప్పట్లో మాతాత ఇందిరా గాంధీని భయపెట్టారు వంటి డైలాగులు ఇంకా ఎంతకాలం లోకేష్ గారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News