టిప్పర్‌ను ఢీకొన్న ట్రావెల్స్‌ బస్సు.. నలుగురు మృతి

ఈ ఘటనలో మరో 13 మందికి తీవ్ర గాయాలు

Advertisement
Update:2025-01-17 07:45 IST

చిత్తూరు సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. గంగాసాగరం వద్ద ఆగి ఉన్న టిప్పర్‌ను ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీకొన్న ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు మృతి చెందారు. మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం వేలూరు సీఎంసీ, నరివి ఆస్పత్రులకు తరలించారు. ట్రావెల్స్‌ బస్సు తిరుపతి నుంచి మధురై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. 

Tags:    
Advertisement

Similar News