హైద‌రాబాద్ లో మెగాస్టార్  సంద‌డి...! 

మెగాస్టార్ 150 వ‌ చిత్రం షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. ఏ విష‌యంలోను  చిరు కాంప్ర‌మైజ్ కావ‌డం లేద‌ని తెలుస్తుంది. టెక్నిషియ‌న్స్  విష‌యం నుంచి త‌న యాక్టింగ్ వ‌ర‌కు అన్ని త‌న నుంచి ఆడియ‌న్స్ ఆశించే అంశాలు  ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ  సినిమా చేయిస్తున్న‌ట్లు తెలుస్తుంది.  ప్ర‌భుదేవ‌,  లారెన్స్  ల‌తో కొరియోగ్ర‌ఫి..  సునిల్  తో కామెడి ట్రాక్..  ఇలా మ్యాగ్జిమ‌మ్  కేర్ తీసుకుంటూ  వివి వినాయ‌క్  ద‌ర్శ‌క‌త్వంలో   నెపోలియ‌న్ చిత్రం  తెర‌కెక్కుతుంది. ప్ర‌స్తుతానికి నెపొలియ‌న్  పేరు అనుకుంటున్నారు.  […]

;

Advertisement
Update:2016-08-11 09:47 IST
మెగాస్టార్ 150 వ‌ చిత్రం షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. ఏ విష‌యంలోను చిరు కాంప్ర‌మైజ్ కావ‌డం లేద‌ని తెలుస్తుంది. టెక్నిషియ‌న్స్ విష‌యం నుంచి త‌న యాక్టింగ్ వ‌ర‌కు అన్ని త‌న నుంచి ఆడియ‌న్స్ ఆశించే అంశాలు ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ సినిమా చేయిస్తున్న‌ట్లు తెలుస్తుంది. ప్ర‌భుదేవ‌, లారెన్స్ ల‌తో కొరియోగ్ర‌ఫి.. సునిల్ తో కామెడి ట్రాక్.. ఇలా మ్యాగ్జిమ‌మ్ కేర్ తీసుకుంటూ వివి వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో నెపోలియ‌న్ చిత్రం తెర‌కెక్కుతుంది. ప్ర‌స్తుతానికి నెపొలియ‌న్ పేరు అనుకుంటున్నారు.
బుధవారం నుంచి నగర శివార్లలో చిరంజీవి, ఇతర ప్రధాన తారాగణంపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ఈ సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది చరణ్‌ ఉద్దేశం. అందుకు తగ్గట్టుగానే నిరాటంకంగా చిత్రీకరణ జరుపుతున్నారు. నృత్యాల విషయంలో చిరు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని, పాటలు చిరు అభిమానుల్ని అలరించేలా తీర్చిదిద్దుతున్నట్టు చిత్రబృందం తెలిపింది. ఓ పాటకు ప్రభుదేవా, మరో పాటకు లారెన్స్‌ నృత్యరీతులు సమకూరుస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నెల 22న చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా సినిమా తొలి ప్రచార చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలున్నాయి. ఆ రోజే సినిమా పేరు ఫైన‌ల్ చేసి ప్రకటిస్తారని తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News