మంగళగిరిలో నయీంకు వంద కోట్ల ఆస్తులు!
గ్యాంగ్‌స్టర్ నయీం అక్రమాస్తుల చిట్టా గుట్టు ఒక్కొక్కటిగా వీడుతోంది. ఇతని స్థావరాల నుంచి వేలాది డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు అవి ఎక్కడెక్కడ ఉన్నాయి? వాటిని ఎవరి సాయంతో కొనుగోలు చేశాడు? అన్న విషయాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆస్తులను కూడబెట్టడంలో నయీం ఒక్క తెలంగాణకే పరిమితం కాలేదు. కర్నాటక, మహారాష్ట్ర, ఏపీ ఇలా పొరుగు రాష్ర్టాలలోనూ వేల కోట్ల ఆస్తులు, భూములు కొనుగోలు చేశాడు. తాజాగా వెలుగుచూసిన డాక్యుమెంట్ల ద్వారా అతనికి ఏపీలోనూ ఆస్తులున్నాయని వెల్లడైంది. […]
Advertisement
గ్యాంగ్‌స్టర్ నయీం అక్రమాస్తుల చిట్టా గుట్టు ఒక్కొక్కటిగా వీడుతోంది. ఇతని స్థావరాల నుంచి వేలాది డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు అవి ఎక్కడెక్కడ ఉన్నాయి? వాటిని ఎవరి సాయంతో కొనుగోలు చేశాడు? అన్న విషయాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆస్తులను కూడబెట్టడంలో నయీం ఒక్క తెలంగాణకే పరిమితం కాలేదు. కర్నాటక, మహారాష్ట్ర, ఏపీ ఇలా పొరుగు రాష్ర్టాలలోనూ వేల కోట్ల ఆస్తులు, భూములు కొనుగోలు చేశాడు. తాజాగా వెలుగుచూసిన డాక్యుమెంట్ల ద్వారా అతనికి ఏపీలోనూ ఆస్తులున్నాయని వెల్లడైంది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదకాకాని ప్రధాన రహదారి వెంబడి నయీంకు భూములు ఉన్నట్లు తెలిసింది. ప్రధాన రహదారిని అనుకుని 15 ఎకరాల భూమిని నయీం కొనుగోలు చేశాడని సమాచారం. వీటిని హైదరాబాద్‌కు చెందిన ఓ నిర్మాణ సంస్థ, బిల్డర్ పేరిట రిజిస్ర్టేషన్ చేయించాడు. ఈ భూమలు విలువ రూ.100 కోట్లు దాటి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ కేసును సిట్ అధికారులు రహస్యంగా విచారిస్తున్నారు. ఈ భూములు నయీం ఎప్పుడు కొన్నాడు? ఎలా కొన్నాడు? అక్కడి వారు ఎవరైనా సహకరించారా? అసలివి కొన్నవేనా? లేక లాక్కున్నవా? అన్న విషయాలు పోలీసు విచారణలో తేలాల్సి ఉంది. ఈ విషయాలన్నింటిపైనా విచారణ జరిపేందుకు ఓ బృందం త్వరలోనే ఏపీలోని గుంటూరు జిల్లాకు వెళ్లనుంది. ఈ విషయమై తమకు ఇప్పటి వరకు తెలంగాణ పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం రాలేదని ఏపీ పోలీసులు చెబుతున్నారు.
Advertisement