మోడీని కాల్చెయ్యాలి..!

మోడీని ఒకసారి కాదు వందసార్లు కాల్చాలని, ఆయనను కాల్చిచంపినా పాపం లేదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె. నారాయణ చెప్పాడు. మోడీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి దేశంలో దళిత వ్యతిరేక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని, ఈ రెండేళ్లలో దళితులపై లెక్కలేనన్ని దాడులు జరిగాయని, గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు దళితులకు బ్రతుకు భయం పట్టుకున్నదని అన్నారు. వచ్చే ఏడాది మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఇప్పుడు మోడీకి, ఆయన ప్రభుత్వానికి దళితులంటే భయం పట్టుకుందని వచ్చే […]

Advertisement
Update:2016-08-10 03:00 IST

మోడీని ఒకసారి కాదు వందసార్లు కాల్చాలని, ఆయనను కాల్చిచంపినా పాపం లేదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె. నారాయణ చెప్పాడు.

మోడీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి దేశంలో దళిత వ్యతిరేక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని, ఈ రెండేళ్లలో దళితులపై లెక్కలేనన్ని దాడులు జరిగాయని, గతంలో ఎప్పుడూ లేని విధంగా
ఇప్పుడు దళితులకు బ్రతుకు భయం పట్టుకున్నదని అన్నారు.

వచ్చే ఏడాది మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఇప్పుడు మోడీకి, ఆయన ప్రభుత్వానికి దళితులంటే భయం పట్టుకుందని వచ్చే ఎన్నికల్లో వాళ్లు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేస్తారన్న భయంతోనే ఇప్పుడు దళిత జపం చేస్తున్నారని పేర్కొన్నాడు.

దళితులపై దాడి చేయడానికి ముందు తనను కాల్చాలని మోడీ అంటున్నారని కానీ అందరికన్నా ఎక్కువగా దళితులపై దాడులకు మోడీయే కారణమని ఆయనను ఒకసారి కాదు వందసార్లు షూట్‌ చేసినా పాపం లేదని నారాయణ కోపంగా అన్నాడు.

దళితులపై దాడులకు వ్యతిరేకంగా సీపీఐ, సీపీయం పార్టీలు ఐక్యకార్యాచరణను చేపట్టనున్నట్టు తెలిపారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News