అక్షయ్ నోట పవన్ డైలాగ్!
చూడప్పా సిద్ధప్పా! నేను సింహం లాంటోన్ని.. అది గడ్డం గీసుకుంటుంది.. నేను గీసుకోను.. మిగితాదంతా సేమ్ టు సేమ్. ఇది పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఫేమస్ డైలాగ్. మరి ఈ డైలాగ్ బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ పలికితే ఎలా ఉంటుంది? నిజమా! బాలీవుడ్ యాక్షన్ హీరో ఈ డైలాగు ఎందుకు పలికాడనా మీ సందేహం? అక్కడికే వస్తున్నాం. జీ టీవీలో ప్రసారమయ్యే కొంచెం టచ్‌లో ఉంటే చెబుతా ప్రోగ్రాంకు ఇలియానా డిక్రూజ్‌తో కలిసి వచ్చాడు నటుడు […]
Advertisement
చూడప్పా సిద్ధప్పా! నేను సింహం లాంటోన్ని.. అది గడ్డం గీసుకుంటుంది.. నేను గీసుకోను.. మిగితాదంతా సేమ్ టు సేమ్. ఇది పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఫేమస్ డైలాగ్. మరి ఈ డైలాగ్ బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ పలికితే ఎలా ఉంటుంది? నిజమా! బాలీవుడ్ యాక్షన్ హీరో ఈ డైలాగు ఎందుకు పలికాడనా మీ సందేహం? అక్కడికే వస్తున్నాం. జీ టీవీలో ప్రసారమయ్యే కొంచెం టచ్‌లో ఉంటే చెబుతా ప్రోగ్రాంకు ఇలియానా డిక్రూజ్‌తో కలిసి వచ్చాడు నటుడు అక్షయ్ కుమార్. తన సినిమా రుస్తుం ప్రమోషన్‌లో భాగంగా ఆయన ఈ కార్యక్రమానికి వచ్చారు. అప్పుడు యాంకర్ ప్రవీణ్ ఆయన చేత ఈ డైలాగులు పలికించారు. ఈ కార్యక్రమం త్వరలోనే జీటీవీలో ప్రసారం కానుంది. ఇప్పుడు అక్షయ్ పలికిన ఈ డైలాగులు ఫేస్‌బుక్, ట్వీటర్లలో సందడి చేస్తున్నాయి.
బాలీవుడ్లో అగ్రశ్రేణి హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్న ఈ టైమ్‌లో దక్షిణాదిన విలన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే! త్వరలో రోబో-2 సినిమాలో అక్షయ్ విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే! విలక్షణమైన పాత్రల్ని పోషించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండే అక్షయ్.. అజ్‌నబీ సినిమాలో తొలిసారిగా విలన్‌గా కనిపించారు. ఆ తరువాత నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటించడం ఇది రెండోసారి.
Advertisement